రెజీనాని అంత సెక్సీగా చూపించేశారా?

మరిన్ని వార్తలు

చాలా సినిమాల్లో రెజీనా హాట్‌గా కనిపించింది. హాట్‌ అప్పీల్‌ రెజీనాకి కొత్తేమీ కాదు. అయితే తాజాగా ఓ తమిళ సినిమాలో రెజీనా హాట్‌ అప్పీల్‌ గురించి ఆ సినిమా డైరెక్టరే సంచలన వ్యాఖ్యలు చేశాడు. సినిమా పేరు 'మిస్టర్‌ చంద్రమౌళి'. సీనియర్‌ హీరో కార్తీక్‌ ఈ సినిమాలో ముఖ్య పాత్రలో నటిస్తున్నాడు. కార్తీక్‌ తనయుడు గౌతమ్‌ కార్తీక్‌ సరసన రెజీనా హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాలో ఓ పాట బీచ్‌లో షూట్‌ చేశారు. ఈ పాటలోని రెజీనా ఎక్స్‌పోజింగ్‌ గురించే ఇప్పుడు రచ్చ రచ్చ జరిగిపోతోంది.

 

ఈ పాటలో హాట్‌ హాట్‌ బికినీలతో రెచ్చిపోయింది రెజీనా. రెజీనా - కార్తీక్‌ ఆన్‌ స్క్రీన్‌ రొమాన్స్‌ హద్దులు దాటేసింది. ఇంతవరకూ చాలా సినిమాల్లోనే రెజీనా చాలా మంది హీరోలతో ఆన్‌ స్క్రీన్‌ రొమాన్స్‌ పండించినా, ఆవేమీ ఈ పాటకు సాటి రావంటున్నారు. అంతలా రెజీనా ఈ పాటలో హాట్‌ ఎక్స్‌పోజింగ్‌ చేసేసింది. ఇటీవలే ఈ సాంగ్‌ ప్రోమో వీడియోని రిలీజ్‌ చేసింది చిత్ర యూనిట్‌. అప్పటి నుండే ఈ ఇష్యూ బయటకి వచ్చింది.

 

త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న సందర్భంగా జరిగిన సినిమా ఫంక్షన్‌లో ఈ ఎక్స్‌పోజింగ్‌ గురించి దర్శకున్ని అంతా ప్రశ్నలతో ముంచేత్తేశారట. అంత హాట్‌గా ఆ పాటని ఎలా షూట్‌ చేశారని ప్రశ్నల వర్షం కురిపించారట. దాంతో పాట చాలా హాట్‌గా వచ్చిన మాట నిజమే. కానీ సినిమాలో అవేమీ కనిపించవు. ఎందుకంటే సెన్సార్‌ అంత తేలిగ్గా ఆ పాటని వదిలేయదు అని దర్శకుడు షాక్‌ ఇచ్చాడు. తమిళంలో రూపొందుతున్న ఈ సినిమా తెలుగులో కూడా విడుదల కానుంది. 'కడలి' సినిమాతో హీరో గౌతమ్‌ కార్తీక్‌ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితుడే.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS