'రంగస్థలం' ఫస్ట్ వీక్ రికార్డుల్ని 'భరత్' దాటేశాడు అని ప్రచారం జరిగింది. కానీ కాస్తలో వెనకబడ్డాడట. అయినా సరే దూకుడు కొనసాగుతోంది. వసూళ్ల ప్రభంజనం సాగుతోంది. సూపర్‌హిట్‌గా నిలిచింది సినిమా. ప్రమోషన్స్ కూడా బాగా నిర్వహిస్తున్నారు ఈ సినిమాకి. డైరెక్ట్‌గా మహేష్‌బాబు రంగంలోకి దిగి, ప్రమోషన్స్‌లో యాక్టివ్‌గా పాల్గొంటున్నాడు. ఈ సినిమాలో మహేష్ సీఎం పాత్రలో కనిపించడం ఓ కొత్తదనం. ఆ యాంగిల్‌లో రాజకీయ ప్రముఖుల్ని కూడా తన ప్రమోషన్‌కి వాడేస్తున్నాడు మహేష్‌బాబు.
తాజాగా తెలంగాణా మంత్రి కేటీఆర్‌తో ఓ ఇంటర్వ్యూ కమ్ డిస్కషన్ పాయింట్ 'భరత్' ప్రమోషన్స్‌కి హైలైట్‌గా చెప్పొచ్చు. మరో పక్క డైరెక్టర్ కొరటాల శివ, హీరో మహేష్‌బాబు బహిరంగంగా జనంతో మమేకమవుతూ, 'భరత్' సినిమా విశేషాల్ని తెలుసుకుంటున్నారు. ఇప్పటికే చాలా మంది సీనియర్ ప్రముఖులు ఈ సినిమాని చూసి, తమ తమ అభిప్రాయాల్ని తెలియపరుస్తున్నారు. సినిమా చాలా బాగుందని ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఓ మంచి మెసేజ్‌ని సమాజానికి అందించారనీ కీర్తిస్తున్నారు.
ముఖ్యమంత్రిగా సీఎం సినిమాలో చేసిన పనుల్ని రియల్ లైఫ్‌లో మేం చేయలేం కానీ, సక్సెస్ కావాలంటే సినిమాటిక్‌గా అలాంటి లాజిక్స్ తీయకూడదని మంత్రి కేటీఆర్ అన్నారు. సమాజంలో జరుగతున్న పలు అంశాల్నీ, రాజకీయాల్లో ఉన్నందుకు, రోజూ మేము పడే బాధని కూడా ఈ సినిమాలో చూపించినందుకు భరత్ టీమ్‌కు కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. అలాగే మీడియా పనితీరుపై సినిమాలో చూపించిన సన్నివేశాలు, డైలాగులు తనకు బాగా నచ్చాయని కేటీఆర్ అన్నారు. టోటల్‌గా 'భరత్ అనే నేను' సూపర్‌స్టార్ మహేష్‌బాబుకి మంచి విజయాన్ని అందించింది.