ఆ సూప‌ర్ హిట్ గీతం.... మ‌ళ్లీ మ‌రోసారి

By iQlikMovies - October 08, 2018 - 10:29 AM IST

మరిన్ని వార్తలు

'వేట‌గాడు' అన‌గానే అందులో గుర్తొచ్చే మొద‌టి పాట 'ఆకు చాటు పిందె త‌డిసె'.  ఈ గీతం అప్ప‌ట్లో మాస్‌ని ఓ ఊపు ఊపేసింది.  ఓ క‌మ‌ర్షియ‌ల్ సినిమాలో ఎలాంటి పాట‌లుండాలో చెప్ప‌డానికి ఉదాహ‌ర‌ణ‌గా నిలిచింది. ఈ పాట కోస‌మే ఈ సినిమాని మ‌ళ్లీ మ‌ళ్లీ చూడ్డానికి ప్రేక్ష‌కులు ఎగ‌బ‌డేవారంటే అతిశ‌యోక్తి కాదు. 

ఈ పాట‌ని ఎన్టీఆర్ సినిమాలో రీమిక్స్ చేశారు. 'రెండు వేల రెండు వ‌ర‌కూ చూడ‌లేదే ఇంత సొగ‌సూ' అంటూ ప‌దాలు మార్చుకున్నారు. ఇప్పుడు 'ఎన్టీఆర్' బ‌యోపిక్‌లో ఈ పాట‌ని మ‌రోసారి గుర్తు చేస్తున్నారు. `ఎన్టీఆర్‌` జీవిత క‌థ ఆధారంగా బ‌యోపిక్ రూపొందుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా కోసం 'ఆకు చాటు పిందె త‌డిసె' పాట‌ని బాల‌య్య - ర‌కుల్‌ల‌పై తెర‌కెక్కిస్తారు. 

ఈ సినిమాలో శ్రీ‌దేవిగా ర‌కుల్ ప్రీత్ సింగ్ న‌టిస్తున్న సంగతి తెలిసిందే. ఈ పాట‌తోనే ఆమె ఈ సెట్లో ఎంట్రీ ఇవ్వ‌బోతోంది. ఈ పాట‌తో పాటు ఎన్టీఆర్ - శ్రీ‌దేవిల‌పై వ‌చ్చిన కొన్ని సూప‌ర్ హిట్ గీతాలు 'ఎన్టీఆర్' బ‌యోపిక్‌లో క‌నిపిస్తాయ‌ని, వినిపిస్తాయ‌ని స‌మాచారం.  

  2019 సంక్రాంతి కానుక‌గా `ఎన్టీఆర్‌` బ‌యోపిక్‌లోని తొలి భాగం విడుద‌ల కానుంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS