బోయపాటి శ్రీను సినిమాల్లో బాగా నిరాశ పరిచిన చిత్రం ఏమైనా ఉందీ అంటే.. అది 'దమ్ము'నే. ఎన్టీఆర్ - బోయపాటి సినిమా కాబట్టి దానిపై విపరీతమైన అంచనాలు ఏర్పడ్డాయి. అయితే... ఆ అంచనాల్ని అందుకోవడంలో దమ్ము విపలమైంది. అయితే... ఇప్పుడు రామ్‌చరణ్‌తో చేస్తున్న సినిమా కథకీ, 'దమ్ము' కథకీ దగ్గర పోలికలు ఉన్నట్టు సమాచారం అందుతోంది.
ఇందులో రామ్ చరణ్ ఇద్దరు అన్నలకు ముద్దుల తమ్ముడిగా నటిస్తున్నాడట. గొడవలంటే అస్సలు పడని చరణ్.. తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఆయుధం పట్టాల్సివస్తుందని అక్కడే కథ మలుపు తిరుగుతుందని తెలుస్తోంది. దానికి తగ్గట్టే టైటిల్‌ని కూడా 'వినయ విధేయ రామ'గా ఫిక్స్ చేశారని సమాచారం. వినయం, విధేయత లక్షణాలు కలిగిన రాముడు.... హింస వైపు ఎందుకు నడవాల్సివచ్చిందనేది ఆసక్తికరంగా ఉంటుందుని తెలుస్తోంది.
'దమ్ము'లో కూడా విశ్రాంతి ముందే కథానాయకుడి ధీరత్వాన్ని ప్రేక్షకులకు చూపించాడు బోయపాటి. కథ వేరైనా అదే ఫార్ములాలో ఇప్పుడు మరో కథ రాసుకున్నాడన్నమాట. మరి 'దమ్ము'లా ఈ సినిమా నిరాశ పరుస్తుందా? లేదంటే... ఆ సినిమా ఫ్లాప్ అయిన లోటుని తీరుస్తుందా? అనేది తెలియాలంటే ఇంకొంత కాలం ఆగాలి.