పవన్ కళ్యాణ్ మాజీ సతీమణి ఈ మధ్య రీ ఎంట్రీలోకి వచ్చిన సంగతి తెలిసిందే. బుల్లితెరపై ప్రసారం అవుతోన్న ఓ డాన్స్ ప్రోగ్రాంకి జడ్జ్‌గా వ్యవహరిస్తోంది రేణూ దేశాయ్. అయితే ఈ సందర్భంగా ఆమె ఓ ఛానల్‌కిచ్చిన ఇంటర్వ్యూలో రెండో పెళ్లి ప్రస్థావన వచ్చినందుకు సోషల్ మీడియాలో పవన్ అభిమానులు ఆమెని గుమ్మెత్తి పోస్తున్నారు. అయినా రెండో పెళ్లి అనేది పూర్తిగా ఆమె సొంత వ్యవహారం. అందులో జోక్యం చేసుకోవడమనేది పవన్ ఫ్యాన్స్‌కి సంబంధం లేని విషయం అయినప్పటికీ వివాదం ఆగడం లేదు. ఆఖరికి అందుకోసం ఆమె సంజాయిషీ చెప్పుకొనేదాకా వెళ్లింది ఈ వివాదం. ఈ విషయంపై రేణూదేశాయ్ స్పందించింది. పవన్ ఫ్యాన్స్‌కి వివరణ ఇచ్చింది. పవన్ కళ్యాణ్‌తో విడిపోయినా కానీ ఆయన్ని నేనెప్పుడూ ఒక్క మాట కూడా అనలేదు. అలాగే పవన్ ఫ్యాన్స్ అన్నా నాకు అభిమానమే. నేను వారిని ఏమీ అనలేను. అయినప్పటికీ 'రెండో పెళ్లి' అనే మాట తాను తన కోసం అన్నది కాదు. సహజంగా ఏదో సందర్భాన్ని బట్టి వచ్చిన మాటే అది. అలా మాట వరసకి అన్న మాటని పట్టుకుని ఇంత రాద్ధాంతం చేస్తున్నారనీ ఆమె అంది. అయినప్పటికీ ఈ విషయంలో మీడియా అత్యుత్సాహాన్ని వీడి, కొంచెం సంయమనం పాఠించాలనీ ఆమె కోరింది. మీడియా ఛానెల్స్ వివాదాన్ని సృష్టించి, దాన్ని తప్పుదోవ పట్టించడం మానేసి, చర్చని సానుకూల దృక్పథంలో జరిగేలా ప్రసారం చేయాలంటూ రేణూ సూచించింది. అలాగే సోషల్ మీడియా సోదరులను కూడా అనవసర చర్చలకు దూరంగా ఉండి. చదువు, ఆరోగ్యం, ఉద్యోగం వంటి ముఖ్య విషయాల గురించి చర్చిస్తే బావుంటుందనీ, అలాగే ప్రతీ ఒక్కరూ తమ కుటుంబంలోని మహిళల సమస్యలను పరిష్కరించేందుకు ముందుకు రావాలని కోరింది రేణూదేశాయ్.