ఒక నటిగా కన్నా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భార్య గా పేరు ప్రఖ్యాతలు గడించిన రేణు దేశాయ్ ఒక సంచలన ప్రకటన చేసింది.
అయితే ఆ ప్రకటన పాతదే అయిన, తను ఈ సారి చెప్పిన విధానం కొంచెం కుండబద్దలు కొట్టిన మాదిరిగా ఉంది. ఇక వివరాల్లోకి వెళితే, రేణు దేశాయ్ తన మాజీ భర్త అయిన పవన్ నుండి విడాకులు పొందిన నాటినుండి పవర్ స్టార్ అభిమానులు పదే పదే ఆమెని మళ్ళీ పవన్ జీవితంలోకి రమ్మని కోరుతున్నారు.
అయితే వాటిని చాలా సార్లు సున్నితంగా తిరస్కరిస్తూ వస్తూ ఉన్న రేణు నిన్న మాత్రం కొంచెం గట్టిగానే ఈ అంశం పై స్పందించింది.
అదేంటంటే- పవన్ భార్య ఇప్పుడు ‘ఆనా’ నేను కాదు. ఇంకా పవన్-ఆనాలకు ఒక పాప కూడా జన్మించింది. మీరు దయచేసి వారి వివాహ బంధానికి గౌరవం ఇచ్చే వారు ఐతే నన్ను మళ్ళీ పవన్ జీవితంలోకి వెళ్ళమని అడగకండి.
ఎందుకంటే మేము ఇద్దరం మళ్ళీ భార్యాభర్తలుగా కలవడం అనేది జరగదు. ఇక ఆయన నా పిల్లలకు మంచి తండ్రి అలాగే నాకు మంచి స్నేహితుడు. ఇంతకుమించి ఈ అంశాన్ని మళ్ళీ మళ్ళీ ప్రస్తావించకండి అని ఫ్యాన్స్ కి విజ్ఞప్తి చేసింది.