యంగ్ హీరో నితిన్‌కి ఈ మధ్య ఏది పట్టుకున్నా కలిసి రావడం లేదు. వరుసగా మూడు సినిమాలు నిరాశపరచడంతో ఇక ఇలా కాదని సక్సెస్‌ల డైరెక్టర్ రాజుగారితో టై అప్ పెట్టుకున్నాడు. కానీ ఈ సారి రాజుగారి వల్ల కూడా కాలేదు పాపం నితిన్‌ని ఆదుకోవడం. ఈ సినిమాని ప్రమోట్ చేయడంలో రాజుగారు అదే దిల్ రాజు చాలా చాలా ఓపెన్ ఆఫర్స్‌ని ఆఫర్ చేశారు.
కానీ అవేమీ సినిమా విజయానికి కూసింతైన ప్లస్ కాలేకపోయాయి. దిల్‌రాజు బ్యానర్‌లో 'శతమానం భవతి' సినిమాతో మంచి విజయం అందుకున్న డైరెక్టర్ సతీష్ వేగేశ్న, నితిన్‌కి కలిసి రాలేదు. పెళ్లి నేపథ్యంలో తెరకెక్కిన 'శ్రీనివాస కళ్యాణం' సినిమాను ప్రేక్షకులు ఆశించిన మేర ఆదరించలేకపోయారు. అందుకు కారణం సినిమాలో పెళ్లి కాన్సెప్ట్‌ని మరీ సాగదీతగా చెప్పడమే అనేది ఒక టాక్. దాంతో పాటు, సీనియర్ మోస్ట్ తారాగణం స్క్రీన్ నిండా ఉన్నప్పటికీ, సరిగ్గా వాడలేదన్నది మరో కారణం.
నితిన్‌ని రాముడు మంచి బాలుడు అన్నట్లుగా చూపించేయడం కూడా ఈ జనరేషన్‌కి నచ్చలేదట. ఈ జనరేషన్ అంతా 'అర్జున్‌రెడ్డి' తరహానే కోరుకుంటోంది. ఆ ఆటిట్యూడ్‌నే మెచ్చుకుంటోంది. చూశారుగా, అర్జున్‌రెడ్డి తర్వాత 'ఆర్ ఎక్స్ 100' అనే సినిమాని ఏ స్థాయిలో ఆదరించేశారో ప్రేక్షకులు. అంటే హీరో ఆటిట్యూడ్‌ని ఆ రేంజ్‌లో డిజైన్ చేయాలి మరి మన దర్శక నిర్మాతలు.
సో ఆడియన్స్ పల్స్‌ని బట్టి రైటర్స్ స్క్రిప్టు ప్రిపేర్ చేయాలండోయ్. అయినా ఇదీ కష్టమే సుమీ. ఎప్పుడు ఎలాంటి ఆటిట్యూడ్‌కి ఆడియన్స్ కనెక్ట్ అవుతున్నారో కూడా తెలియడం లేదు మరి.