మహేష్ బాబు నటిస్తున్న చిత్రం `సర్కారు వారి పాట`. కీర్తి సురేష్ కథానాయిక. పరశురామ్ దర్శకుడు. త్వరలోనే ఈ సినిమా ప్రారంభం కాబోతోంది. ఇందులో రేణూ దేశాయ్ నటిస్తోందని గత కొన్ని రోజులుగా వార్తలు చలామణీ అవుతున్నాయి. మహేష్‌కి అక్క అని, వదిన అని.. ఏకంగా అమ్మే అని.. రకరకాల వార్తలు పుట్టుకొచ్చాయి. వీటిపై క్లారిటీ ఇచ్చింది రేణూ. తాను మహేష్ సినిమాలో నటించడం లేదని తేల్చేసింది. అలాంటి వార్తలు నమ్మొద్దని చెప్పేసింది.
``నేను సోషల్ మీడియాలో యాక్టీవ్ గానే ఉంటున్నా. ఏ కొత్త సినిమా ఒప్పుకున్నా నేనే ట్విట్టర్ లో పోస్ట్ చేస్తా. ఎవరేం చెప్పినా నమ్మొద్దు`` అని విజ్ఞప్తి చేసింది. రేణుకి ఈమధ్య ఆఫర్లు బాగానే వస్తున్నా, పెద్ద సినిమాల్లో మాత్రం రావడం లేదు. బడా స్టార్లు, దర్శకులు రేణూని పట్టించుకోవడం లేదని టాక్. ఏదైనా ఓ పెద్ద సినిమాలో ఛాన్స్ వస్తే... వరుసగా సినిమాలు చేసుకుంటూ సెటిల్ అయిపోదామనుకుంటోంది రేణూ. కానీ.. అంత బిగ్ ఆఫర్ వచ్చేది ఎప్పుడో?