ఇటీవల ఓ ఓటీటీ కంటెంట్‌లో హాట్ హాట్‌గా కనిపించింది పదహారణాల తెలుగమ్మాయ్ అంజలి. తెలుగులో బాలయ్య, వెంకటేష్ తదితర అగ్ర హీరోల సరసన నటించిన అంజలి, తమిళంలో స్టార్‌డమ్ యాంగిల్‌లో చూస్తూ, చెప్పుకోదగ్గ పేరు ప్రఖ్యాతులే సంపాదించుకుంది. ఒకే ఒక్క ఓటీటీ ప్రయత్నంతో తన ఇమేజ్ పాడైపోయిందన్న ఆవేదనలో అంజలి వుందా.? అంటే, ఔననే అంటున్నారు చాలామంది.
‘వెండితెరపై హాట్‌గా కనిపించినా అదొక లెక్క.. ఇలా ఓటీటీ కోసం ఇంత స్థాయికి దిగిపోవడం అవసరమా.?’ అన్న ప్రశ్న అంజలికి, ఆమె అభిమానుల నుంచి సోషల్ మీడియా వేదికగా దూసుకొచ్చింది. దాంతో, ఇకపై ఇలాంటివి చేయకూడదని అంజలి నిర్ణయించుకుందట. అయితే, ఇప్పుడంతా ఓటీటీ మీదనే పడ్డారు.
వెబ్ సిరీస్‌లనీ, ఇంకోటనీ.. ఆ ట్రెండే వేరు. రెమ్యునరేషన్ పరంగా చూసుకున్నా, సెలబ్రటీలకు పెద్ద పండగే అవుతోంది. అలాంటప్పుడు ఎవరో ఏదో అనుకుంటున్నారనే కోణంలో తమకు తగిలిన బంపర్ ఆఫర్‌ని ఎవరన్నా వదులుకుంటారా.? అన్నది మరికొందరి ప్రశ్న. నిజమే, ఓటీటీ అంటే సెలబ్రిటీలకు బోల్డన్ని అవకాశాల్ని కల్పించే వదిక. దాన్ని వదులుకోవడం అవివేకమే అవుతుంది.