పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సినిమాలకు దూరమై, పాలిటిక్స్‌కి దగ్గరవుతున్నారు. ఆ క్రమంలో జనయాత్ర పేరుతో జనంతో మమేకమవుతున్నారు.
ఇదిలా ఉండగా, పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణూదేశాయ్, పవన్ తనకు విడాకులివ్వకుండానే మూడో భార్య అన్నా లెజినోవాని పెళ్లి చేసుకున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. అంతేకాదు, పవన్‌కి తాను విడాకులివ్వడానికి కూడా ఆయనే కారణమంటూ రేణూదేశాయ్ చెప్పడంతో వివాదం మరింత ముదిరింది. సోషల్ మీడియా వేదికగా ఈ విషయమై కొందరు ఆమెపై విరుచుకుపడుతున్నారు. గతంలో రేణూ ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యల్నీ, తాజాగా ఆమె పవన్‌తో విడాకుల వ్యవహారమై చేసిన వ్యాఖ్యల్నీ పోల్చుతూ రేణూ వెనక ఎవరో ఉండి ఇదంతా చేయిస్తున్నారంటూ అభిమానులు ఆరోపిస్తున్నారు.
రేణు దేశాయ్ ఏమాత్రం వెనుకాడకుండా సోషల్ మీడియా వేదికగా ఏదో ఒక రకంగా పవన్‌నీ, పవన్ ఫ్యాన్స్‌నీ కెలుకుతూనే ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనూ పవన్‌ని విడిచి పెట్టేలా లేదనిపిస్తోంది. పవన్ కళ్యాణ్ పొలిటికల్ కెరీర్‌కి ఇదో పెద్ద మచ్చగా మారే ప్రమాదాలున్నాయి. అంతేకాదు, రేణూ దేశాయ్ తాజాగా పవన్, తనకి విడాకులు ఇవ్వకుండానే అన్నాలెజినోవాతో కూతురు కన్నాడనీ చెబుతుండడం మరింత సంచలనాలకు దారి తీసింది. ఇదంతా చూస్తుంటే, రేణూ దేశాయ్ ఏదో పెద్ద ప్లానింగ్‌తోనే ఈ రకంగా వ్యవహరిస్తోందనిపిస్తోంది.
అసలెందుకు రేణూ దేశాయ్ ఇలా చేస్తోంది? పవన్ కళ్యాణ్ ఇమేజ్‌ని డ్యామేజ్ చేయడానికేనా చూడాలి మరి, రేణూ ఇష్యూ ఇంకెంత దూరం వెళుతుందో.!