RX 100 రెండు రోజుల కలెక్షన్స్ తెలిస్తే షాక్ అవుతారు

By iQlikMovies - July 14, 2018 - 20:47 PM IST

మరిన్ని వార్తలు

ఇప్పుడు ఎక్కడ చూసినా విన్నా అందరు మాట్లాడుకుంటున్న సినిమా RX100. ఈ సినిమాకి సంబంధించిన వసూళ్ళు ఇప్పుడు టాక్ అఫ్ ది టౌన్ గా మారిపోయాయి.

మొదటిరోజు రూ 1. 3 కోట్ల షేర్ వసూలు చేసి సంచలనం సృష్టించగా రెండవ రోజు సైతం రూ 1కోటి పైగా షేర్ వసూలు చేయడంతో అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. దీనితో RX 100 చిత్రం దాని నిర్మాణ వ్యయం తో పోలిస్తే ఇది ఒక బ్లాక్ బస్టర్ అని చెప్పేయొచ్చు.

ఇక ఈ సినిమాకి పాజిటివ్ టాక్ రావడంతో ఈరోజు, రేపు వసూళ్ళ పరంగా మరో రెండు నుండి మూడు కోట్లు వసూలు చేస్తుంది అని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇక బడ్జెట్ పరంగా చూస్తే RX 100 చిత్రం లాభాల్లోకి వచ్చేసినట్టుగా చెప్పేయొచ్చు. 

ఆదివారం తరువాత ఈ చిత్రం ఎంత వసూలు చేయనుంది అన్న ఆసక్తి అందరిలోనూ ఉంది.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS