రెండు కార్లు అమ్మేసిన రేణూ..!

By iQlikMovies - August 12, 2020 - 12:00 PM IST

మరిన్ని వార్తలు

ఎప్పుడూ ట్విట్ట‌ర్‌లో ఏదో ఓ విష‌య‌మై అభిమానుల‌కు ట‌చ్‌లో ఉండ‌డం రేణూ దేశాయ్‌కి అల‌వాటు. ట్విట్ట‌ర్, ఇన్‌స్ట్రాగ్రామ్ లోనూ ఆమెకు విప‌రీత‌మైన ఫాలోయింగ్ ఉంది. తాను ఏం చేసినా - బాగానే వైర‌ల్ అవుతోంది. తాజాగా రెండు ఖ‌రీదైన కార్ల‌ని అమ్మేసింది రేణూ. ఆ విష‌యాన్ని ఇన్‌స్ట్రాలోనూ తెలియ‌జేసింది.

ఇటీవ‌ల‌ మారిష‌స్‌లో చ‌మురు లీకేజీ వ‌ల్ల జ‌రిగిన న‌ష్టాన్ని గుర్తు చేస్తూ పెట్రోల్‌, డీజిల్ వాడ‌కాన్ని త‌గ్గించాల‌ని స‌ల‌హా ఇస్తోంది రేణూ. `ద‌య‌చేసి అంద‌రూ ఎల‌క్ట్రిక్ కార్లు, బైకులను కొనండి. ప్ర‌తీరోజు వాడే పెట్రోల్ , డీజిల్ కు ప్ర‌త్యామ్న‌య వ‌న‌రుల‌ను అన్వేషించండి. నేను ఇంధ‌నంతో న‌డిచే ఆడీ ఏ6 , పోర్షే బాక్స‌ర్ కార్ల‌ను అమ్మేసి ఈ ఎల‌క్ట్రిక‌ల్ హ్యుందాయ్ కోన కారుని తీసుకున్నాను. నా రెండు కార్ల‌ను అమ్మ‌డం క‌ష్ట‌మైన విష‌య‌మే అయినా మారిష‌స్‌లో జ‌రిగిన చ‌మురు లీకేజీ గురించి చ‌దివి ఈ నిర్ణ‌యం తీసుకున్నాను` అని వెల్ల‌డించింది రేణు దేశాయ్‌.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS