అతిలోకసుందరి శ్రీదేవి మరణం అందరిని ఎంతగానో బాధపెట్టింది అదే విధంగా ఆమె పార్థీవదేహాన్ని దుబాయ్ నుండి ముంబైకి తరలించే సందర్భంలో ఏర్పడిన జాప్యం అందరిని మరింతగా కలిచివేసింది.
ఇక ప్రస్తుతం ఆమె పార్థీవదేహాన్ని ప్రజల సందర్శనార్ధం ముంబైలోన్ సెలబ్రిటీ స్పోర్ట్స్ క్లబ్ లో ఉంచడం అక్కడ ప్రముఖులు, సామాన్య ప్రజానీకం ఆమెకి చివరిసారిగా నివాళి అర్పిస్తున్నారు. అయితే ఆ ప్రదేశంలో మాత్రం మీడియాకి పలు ఆంక్షలు విధించారు.
అవేంటంటే- మీడియా వారు నివాళి అర్పించే సమయంలో వారు కెమెరా, వీడియో, ఫోన్ వంటివి లోపలి తీసుకురాకూడదు అన్న ఆంక్షలు విధించారు. దీనితో కేవలం ఆ క్లబ్ ఆవరణలో ఏమి జరుగుతున్నది అన్నది మాత్రమే మీడియా చూపెట్టగలుగుతున్నది.
దీనికి కారణం గత రెండు రోజుల నుండి ఆమె మృతి పైన మీడియా చేస్తున్న అత్యుత్సాహ ధోరణే కారణమని చెప్పింది.