అందాల తార శ్రీదేవి అంత్యక్రియలు కాస్సేపట్లో జరగనున్నాయి. ఈ రోజు మధ్యాహ్నం 3.30 గంటలకు శ్రీదేవి అంత్యక్రియలు జరగనున్నాయి.
టాలీవుడ్ నుండి సినీ ప్రముఖులు ముంబయ్ చేరుకుని, ఆమె భౌతికకాయానికి నివాళులు అర్పిస్తున్నారు. చిరంజీవి, వెంకటేష్, నాగార్జున తదితర టాలీవుడ్ ప్రముఖులు ముంబయ్‌లోని శ్రీదేవి నివాసంలో ఆమె భౌతిక కాయానికి నివాళులు అర్పించారు. శ్రీదేవి అంతిమ యాత్రలో పలువురు సినీ ప్రముఖులు భారీ ఎత్తున పాల్గొనే అవకాశాలున్నాయనీ తెలుస్తోంది.
మరో పక్క ఆమె అభిమానులు చివరి సారిగా శ్రీదేవిని చూడాలని పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. దుబాయ్ నుండి రాత్రి ప్రత్యేక విమానంలో శ్రీదేవి భౌతిక కాయం ముంబయ్‌కి తరలించారు. తొలుత లోఖండ్‌వాలాలోని ఆమె స్వగృహంలో శ్రీదేవి భౌతిక కాయాన్ని ఉంచారు. ఆ తర్వాత అభిమానుల సందర్శనార్ధం సెలబ్రేషన్స్ స్పోర్ట్స్ క్లబ్‌కి తరలించారు. మద్యాహ్నం సమయంలో శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
యాక్సిడెంటల్‌గా బాత్ టచ్‌లో పడి మరణించిన శ్రీదేవి, ఇక లేరు అనే మాటను అభిమానులు, ఆమె సన్నిహితులు ఇంకా నమ్మలేకపోతున్నారు. కానీ ఇది నిజం కదా. ఇంత మంది అభిమానాన్ని చూరగొన్న శ్రీదేవి ఇక లేరు, తిరిగా రారు అన్న చేదు నిజం మింగుడు కాకపోయినా, నమ్మి తీరాల్సిందే. సోషల్ మీడియాలో ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని పలువురు సినీ సెలబ్రిటీస్ బాధాతప్ప హృదయంతో నివాళులు అర్పిస్తున్నారు.