వాల్తేరు వీరయ్య సినిమా ప్రమోషన్స్ మొదలుపెట్టినప్పటి నుండి పూనకాలు అనే మాట వాడుతున్నారు. పూనకాలు లోడింగ్ అంటూ పోస్టర్లు వేస్తున్నారు. అయితే దీనిపై దర్శకుడు బాబీ తన మనసులో మాట చెప్పాడు. పూనకాలు అనే మాట ఎదో హైప్ కోసం మాత్రం ఇచ్చింది కాదట. నిజంగానే వీరయ్య పూనకాలు తెప్పిస్తాడట.
''వాల్తేరు వీరయ్య మాస్ జాతర. మెగాస్టార్ వార్ కి వస్తే ఎలా వుంటుందో.. శంఖం ఊదితే ఎలా గూస్ బంప్స్ వస్తాయో .. ఒక నిమిమిది నిమిషాల పాటు థియేటర్ మొత్తం పూనకాలే. ఊరికే ట్యాగ్ పెట్టలేదు. గట్టి నమ్మకంతో చెబుతున్నాను. పూనకాలు లోడింగ్ హైప్ కోసం పెట్టింది కాదు. మనకు ఎన్నో సార్లు పూనకలు ఇచ్చిన అన్నయ్య కి తిరిగి చిరు కానుక గా ఇస్తున్న సినిమా వాల్తేరు వీరయ్య’’ అని చెప్పుకొచ్చాడు బాబీ.