టాలీవుడ్‌లో అత్యధిక పారితోషికం తీసుకొనే హీరో ప్రభాస్. తన పారితోషికం రూ.100 కోట్లు. సాహో, రాధే శ్యామ్ తన సొంత సంస్థలలో చేసిన సినిమాలు. కాబట్టి.. ఆయా సినిమాల పారితోషికం ఎంతన్నది బయటకు రాలేదు. సలార్, ప్రాజెక్ట్ కె చిత్రాలకు మాత్రం రూ.100 కోట్లు అందుకొన్నాడు. ప్రభాస్ స్థాయికి, తన మార్కెట్ కీ , క్రేజ్‌కీ రూ.100 కోట్లు చాలా సబబు. తెలుగులో మరే హీరో... ఇంత పారితోషికం తీసుకోవడం లేదు. అయితే ఇప్పుడు ఈ రికార్డుని అల్లు అర్జున్ బ్రేక్ చేశాడు. పుష్ప 2తో.
అల్లు అర్జున్. సుకుమార్ కాంబినేషన్‌లో వచచిన `పుష్ప` ఎంత పెద్ద హిట్టయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పుడు పుష్ప 2 పట్టాలెక్కింది. ఈ సినిమాకి గానూ. అల్లు అర్జున్ రూ.130 కోట్ల పారితోషికం అందుకోబోతున్నాడని టాక్. రూ.100 కోట్లు పారితోషికం, 30 శాతం లాభాల్లో వాటా అని తెలుస్తోంది. పుష్ప 2కి రూ.100 కోట్ల లాభం వస్తే.. బన్నీ పారితోషికం రూ.130 కోట్లవుతుంది. ఒకవేళ అనూహ్యమైన విజయాన్ని అందుకొని రూ.200 కోట్లు సాధిస్తే.. అప్పుడు బన్నీ పారితోషికం కూడా రూ.130 నుంచి 160 కోట్లవుతుంది. లాభం ఎంత వస్తుంది? అనేది మనం ఇప్పుడే అంచనా వేయలేం కాబట్టి.. నికరంగా మాత్రం రూ.100 కోట్లు ఖాయంగా వస్తుంది. మిగిలినదంతా... బాక్సాఫీసు రిజల్ట్ పై ఆధారపడి ఉంటుంది.ఈ సినిమాకి కనీసం రూ.100 కోట్ల టేబుల్ ప్రాఫిట్ ఖాయమని ట్రేడ్ వర్గాలు లెక్కలు వేస్తున్న నేపథ్యంలో బన్నీ పారితోషిక ఇప్పటికైతే రూ.130 కోట్లు అనుకోవొచ్చు. ఆ లెక్కన ప్రభాస్‌ని దాటేసినట్టే.