డ్రగ్స్ విచారణలో భాగంగా మీడియా ఛానల్లో సినీప్రముఖుల పై వస్తున్న కధనాల పై ఆర్జీవీ పెట్టిన పేస్ బుక్ మెసేజెస్ ఇప్పుడు పెద్ద దుమారాన్ని రేపుతున్నాయి.
ఆయన పోస్ట్ చేసిన మెసేజెస్ పై ఆబ్కారీ శాఖ కమీషనర్ స్పందించారు, ఆయన చేసిన వ్యాఖ్యలు తమ డిపార్టుమెంటు ఆత్మవిశ్వాసాన్ని దేబ్బతీసేలా ఉంది అని చెప్పుకొచ్చాడు. ఇక దీనిపై ఒక టీవీ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో తను మీడియా సంస్థలు చేస్తున్న అనవసరపు హైప్ గురించే తాను మాట్లాడినట్టు అంతే తప్ప విచారణ ఎలా జరగాలి అన్న అంశం పై తాను మాట్లాడలేదు అని స్పష్టంచేశాడు.
ఈ డిబేట్ మొత్తంలో టీవీ ఛానల్ న్యూస్ రీడర్ తమకి తమ తరపు వేగుల ద్వారా వచ్చే సమాచారాన్నే చెబుతున్నాం అని చెప్పాడు. అలాగే తాము కూడా ఏమి లేకుండా, ఏమి సమాచారం లేకుండా టెలికాస్ట్ చేయము అంటూ సదరు రీడర్ ఆర్జీవి తో చెప్పడం కొసమెరుపు.
దీనికి ఆర్జీవీ స్పందిస్తూ- మీ ఛానల్ వారే ఇన్వెస్టిగేషన్ చేపడితే ఉత్తమం అంటూ చమత్కరించాడు.
ఏదేమైనా తనదైన శైలిలో మెసేజెస్ పోస్ట్ చేసి అందరి దృష్టి మరొకసారి తనవైపు తిప్పుకోవడంలో ఆర్జీవీ సక్సెస్ అయ్యాడు అనే చెప్పాలి.