పవన్ కళ్యాణ్ కి మన హీరోల్లో చాలా మంది అభిమానులు ఉన్నారు అన్న సంగతి తెలిసిందే. ఆ జాబితాలో ముందు వినపడే పేరు నితిన్.
ఇక ఈ నితిన్ సినిమాని ఆయన ఆరాధ్య దైవం అయిన పవన్ కళ్యాణ్ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు తెలియాల్సిన విషయమేమిటంటే, ఆ చిత్ర టైటిల్ కూడా పవన్ కళ్యాణ్ నటించిన ఓ చిత్ర టైటిల్ నే కొద్దిగా మార్చి వాడుకోన్నున్నారట..
ఆ టైటిల్ ఏంటంటే- అక్కడ అబ్బాయి ఇక్కడ అమ్మాయి. అయితే పవన్ కళ్యాణ్ మొదటి చిత్రం టైటిల్ అయిన అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి ని అటు ఇటు మార్చి పెడుతున్నారట.
ఇక దీని పై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ఇప్పటికే పవన్ పాటలని రీమేక్ చేసి పవన్ అభిమానుల అభిమానం చూరగొన్న నితిన్ ఇప్పుడు ఏకంగా టైటిల్ నే తీసుకోవడంతో పవన్ అభిమానుల ఫుల్ సపోర్ట్ కొట్టేసాడు అని వేరే చెప్పకర్లేదు.