వర్మ ఏం చేసినా వెరైటీనే. అందుకే ఆఖరికి తల్లితండ్రులపై కూడా రివేంజ్ తీర్చుకోవాలనుకుంటున్నాడు వర్మ. అదేంటంటారా? అయితే ఇదిగో చదవండి. చిన్నప్పుడు వర్మని తల్లితండ్రులు నువ్వు ఎందుకూ పనికి రావురా.. అనేవారట. దాంతో వర్మ పెద్దయ్యాక ఎలాగైనా తల్లితండ్రులపై రివేంజ్ తీర్చుకోవాలనుకున్నారట. అది ఎలాగంటే లైఫ్లో అందరూ తన గురించి గొప్పగా మాట్లాడుకునేలా ఎదిగి చూపించడం ద్వారా తల్లితండ్రులపై రివేంజ్ తీర్చుకోవాలనుకున్నాడట వర్మ. అందులో భాగంగా 'శివ' ఓపెనింగ్ టైమ్లో తన తండ్రి చేత క్లాప్ కొట్టించి, తండ్రిపై రివేంజ్ తీర్చుకున్నానంటున్నాడు వర్మ. ఈ విషయం చెబుతూ, అప్పుడు వర్మ తండ్రి 'శివ' సినిమాకి క్లాప్ ఇస్తున్న ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అలాగే తల్లితో తను నిలబడి ఉన్న ఫోటోని కూడా వర్మ షేర్ చేశాడు. అయితే ఇప్పుడు తన తల్లిపై రివేంజ్ తీర్చుకునే వంతు వచ్చిందంటున్నాడు. చాలా గ్యాప్ తర్వాత వర్మ - నాగ్ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న సినిమాకి తల్లి చేత క్లాప్ కొట్టించి వర్మ తల్లిపై రివేంజ్ తీర్చుకుంటానంటున్నాడు. ఉద్దేశ్యం ఏదైనా కానీ వర్మ, తాను చెప్పాలనుకున్న విషయాన్ని కాంట్రవర్సీ చేసి చెప్పడం ఆయన ప్రత్యేకత. అదే వర్మని కాంట్రవర్సీ డైరెక్టర్గా స్పెషల్గా మాట్లాడుకునేలా చేసింది. ఇటీవలే విడుదలైన 'రాజుగారి గది - 2'లో నాగార్జున మెంటలిస్ట్ పాత్రలో నటించి మెప్పించగా, తాజాగా వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమాలో పోలీసాఫీసర్ పాత్రలో నటించనున్నాడట. ఈ విషయం నాగ్ స్వయంగా చెప్పాడు. ఈ నెల 20న ఈ సినిమా స్టార్ట్ అవుతోంది. పక్కా యాక్షన్ మూవీగా తెరకెక్కుతోన్న ఈ సినిమా వర్మ సొంత బ్యానర్ అయిన 'కంపెనీ'లో రూపొందుతోంది.