శర్వానంద్‌ సీరియస్‌ అయ్యాడు సామీ!

మరిన్ని వార్తలు

విభిన్న తరహా చిత్రాలను ఎంచుకునే యంగ్‌ హీరో శర్వానంద్‌ ట్రాక్‌ మార్చి, కామెడీ హీరోగా సెటిలైపోయాడు. వరుస విజయాలతో తిరుగు లేని హీరో అనిపించుకుంటున్నాడు. అయితే మళ్లీ శర్వానంద్‌ ప్రయోగాలు చేయాలనుకుంటున్నాడట. శర్వానంద్‌ తాజా చిత్రం సుధీర్‌ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. ఈ సినిమాలో శర్వానంద్‌ సీరియస్‌ క్యారెక్టర్‌లో నటించబోతున్నాడనీ సమాచారమ్‌. మాఫియా బ్యాక్‌ డ్రాప్‌లో ఈ సినిమా తెరకెక్కనుందట. 'సామిరారా', 'దోచేయ్‌', 'కేశవ' సినిమాలను తెరకెక్కించి విజయాలు అందుకున్న డైరెక్టర్‌ సుధీర్‌ వర్మ, ఇప్పుడు శర్వానంద్‌తో కొత్త ప్రయోగం చేయబోతున్నాడు. అయితే సీరియస్‌ క్యారెక్టర్‌ అయినా కానీ కామెడీ కూడా పుష్కలంగా ఉంటుందంటున్నాడు శర్వానంద్‌. గతంలోనూ సీరియస్‌ క్యారెక్ట్‌ర్స్‌లో నటించిన అనుభవం ఉంది శర్వానంద్‌కి. 'కో అంటే కోటి' తదితర చిత్రాల్లో సీరియస్‌ క్యారెక్టర్స్‌ చేశాడు. అయితే పర్‌ఫామెన్స్‌ పరంగా ఆ సినిమాలు శర్వాకి మంచి గుర్తింపు తెచ్చి పెట్టాయి కానీ, విజయాల్ని అయితే అందించలేదు. అందుకే మొత్తం అదే ట్రాక్‌ కాకుండా, గెటప్‌ పరంగా సీరియస్‌గా ఉంటాడంతేనట. పర్‌ఫామెన్స్‌ మాత్రం ఎంటర్‌టైనింగ్‌గానే ఉండబోతోందట. కామెడీ శర్వానంద్‌కి బాగా కలిసొచ్చింది. కామెడీ ట్రాక్‌ ఎక్కిన తర్వాతే శర్వా విజయాల బాట పట్టాడు. సో ఆ ట్రాక్‌ని ఎప్పుడూ మిస్‌ కానంటున్నాడు శర్వానంద్‌. కాగా ఈ సినిమాలో శర్వానంద్‌ ఇద్దరు ముద్దుగుమ్మలతో ఆన్‌స్క్రీన్‌ రొమాన్స్‌ చేయబోతున్నాడనీ సమాచారమ్‌. ఒకరు 'అర్జున్‌ రెడ్డి' ఫేం షాలినీ పాండే కాగా, మరో ముద్దుగుమ్మ నివేదా థామస్‌ అని తెలుస్తోంది. ఇవి కాక మరో రెండు ప్రాజెక్టులు శర్వానంద్‌ చేతిలో ఉన్నాయి. ఆ రకంగా ప్రస్తుతం శర్వానంద్‌ సో బిజీ. వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో ఏదో ఒక సినిమాతో స్టార హీరోలకి పోటీ ఇచ్చే పనిలో ఉన్నాడు శర్వానంద్‌.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS