బ్లాక్‌ బస్టర్‌పై కన్నేసిన 'భైరవగీత'.!

మరిన్ని వార్తలు

ఇటీవల రా లవ్‌ స్టోరీగా తెరకెక్కిన 'ఆర్‌ఎక్స్‌ 100' చిత్రం ఏ స్థాయిలో బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ అందుకుందో, కలెక్షన్స్‌ పరంగా ఏ రేంజ్‌లో దూసుకుపోయిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పుడు అదే బాటలో బ్లాక్‌ బస్టర్‌పై కన్నేశారు 'భైరవగీత' అండ్‌ టీమ్‌. కన్నడ, తెలుగు భాషల్లో రూపొందిన ఈ చిత్రం ఆల్రెడీ కన్నడలో విడుదలైంది. తెలుగులో ఈ శుక్రవారం విడుదల కానుంది. ఈ శుక్రవారం 'భైరవగీత'కు పోటీగా పెద్దగా చెప్పుకోదగ్గ సినిమాలేం లేవు.

'అనగనగా ఓ ప్రేమ కథ' వంటి చిన్న సినిమాలున్నా వర్మ నిర్మాణంలో వస్తోన్న 'భైరవగీత'పై ఓ మోస్తరు అంచనాలున్నాయి. అంతేకాదు, ఈ సినిమా అచ్చు గుద్దినట్లు వర్మ శైలిలో ఉండడం ఆ అంచనాలకు మరో కారణం. ఫ్యాక్షన్‌ రా లవ్‌ స్టోరీగా తెరకెక్కుతోన్న ఈ సినిమా ప్రమోషన్స్‌ని భారీగా నిర్వహిస్తున్నారు. సోషల్‌ మీడియా వేదికగా 'భైరవగీత'ను ప్రమోట్‌ చేసేందుకు వర్మ నానా పాట్లు పడుతున్నారు. మరోవైపు బుల్లితెరపై ఈ సినిమా ప్రమోషన్స్‌ అదిరిపోతున్నాయి. హీరో, హీరోయిన్‌ మధ్య లవ్‌ ట్రాక్‌, రొమాంటిక్‌ సీన్స్‌, ఫ్యాక్షన్‌ ఎపిసోడ్స్‌నీ, డైలాగ్స్‌నీ హైలైట్‌ చేస్తూ ఫుల్‌గా 'భైరవగీత'ను ప్రమోట్‌ చేసేస్తున్నారు.

మరోవైపు 'భైరవ', 'గీత' అనేవి హీరో, హీరోయిన్‌ పేర్లు. ఇలా హీరో,హీరోయిన్‌ పేర్లు టైటిల్‌గా వచ్చిన 'గీత గోవిందం' సినిమా ఈ మధ్య బాక్సాఫీస్‌ వద్ద ఎలా కలెక్షన్ల జోరు కురిపించిందో అందరికీ తెలిసిందే. సో అదే బాటలో ఈ భైరవగీత' కూడా విజయం సాధిస్తుందేమో చూడాలి మరి. ధనుంజయ్‌, ఇరా మోర్‌ జంటగా తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి వర్మ శిష్యుడు సిద్దార్ద్‌ దర్శకత్వం వహించాడు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS