బొమ్మాకు క్రియేషన్స్ సంస్థ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ నిజ జీవితాన్ని 3 భాగాల, 3 చిత్రాలుగా నిర్మించబోతోంది. దీనికి సంబంధించిన పార్ట్ 1 సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ రేపు 26 సాయంత్రం 5 గంటలకు రిలీజ్ చేయబోతున్నారు . 3 చిత్రాల్లో ఒక్కొక్క చిత్రం నిడివి సుమారు 2 గంటలుంటుంది మొత్తం 3 చిత్రాలు కలిపి 6 గంటలు. బొమ్మాకు మురళి నిర్మాణంలో రామ్ గోపాల్ వర్మ ఆధ్వర్యంలో "దొరసాయి తేజ" ఈ చిత్రానికి దర్శకత్వం చేయబోతున్నాడు . సెప్టెంబర్ లో ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభం కానుంది. పార్ట్ 1 లో 20 ఏళ్ళ ఆర్జీవీ లాగా ఒక కొత్త యువ నటుడు నటించబోతున్నాడు.
పార్ట్ 2 సినిమాలో లో వేరే నటుడు నటించబోతున్నాడు. పార్ట్ 3 లో ఆర్జీవీ యే స్వయంగా ఆర్జీవీగా నటించబోతున్నారు . 3 పార్టుల్లో ,ఒక్కొక్క పార్టు ఆర్జీవీ గారి జీవితం లోని ఆయన వేరు వేరు వయసుల్లో జరిగిన వేరు వేరు అంశాలను చూపెట్టబోతోంది. మొదటి భాగం సినిమా పేరు "రాము " రామ్ గోపాల్ వర్మ ఆరంభం. దీంట్లో ఆయన విజయవాడ కాలేజ్ రోజులు, ఆయన తొలి ప్రేమలు, అప్పట్లో ఆయన పాల్గొన్న గ్యాoగ్ ఫైట్స్ తో మొదలయ్యి , ఆయన శివ సినిమా చేయడానికి ఎలాంటి పన్నాగాలు పన్నాడు, రిలేన్ షిప్స్ ను ఎలా మాయ చేసి వాడుకున్నాడు అన్నది ప్రధాన కథాంశం గా చూపెట్టబోతోంది. పార్ట్ 2 "రామ్ గోపాల్ వర్మ" అండర్ వరల్డ్ తో ప్రేమాయణం.
ఇది తన ముంబై జీవితంలో అమ్మాయిలు, గ్యాంగ్ స్టర్స్ మరియు అమితాబ్ బచ్చన్ లతో ఆయనకున్న అనుబంధాల గురించి చూపెట్టబోతోంది. పార్ట్ 3 "RGV” ది ఇంటెలిజెంట్ ఇడియట్. ఇది ఆయన ఫెయిల్యూర్లు, వివాదాలు, ఆయనకున్న దేవుళ్ళ పట్ల, సెక్స్ పట్ల , సమాజం పట్ల ఉన్న విపరీత వైఖరులతో పాటు చాలా మంది మీద ఆర్జీవీ ప్రభావం గురించి చూపెట్టబోతోంది.