'సైరా'పై వర్మగారి షాకింగ్‌ ట్వీట్‌ విన్నారా!

By iQlikMovies - September 27, 2019 - 09:04 AM IST

మరిన్ని వార్తలు

సంచలన దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ నుండి ఏ ట్వీట్‌ వచ్చినా అదో సెన్సేషనే. ఆయన ట్వీటులోని తికమక అలాంటిది. అందులోనూ మెగా హీరోల పైనా, మెగా హీరోల సినిమాల పైనా వర్మ ట్వీట్లు ఓ రేంజ్‌లో నెగిటివిటీతో నిండిపోతుంటాయి. అలాంటిది వర్మ ఫస్ట్‌టైమ్‌ షాకిచ్చాడు. మెగా హీరోని ప్రశంసించాడు. అసలు వివరాల్లోకి వెళితే, తాజాగా 'సైరా' సినిమా నుండి సెకండ్‌ ట్రైలర్‌ రిలీజ్‌ చేశారు.

 

ఆ ట్రైలర్‌పై వర్మ పాజిటివ్‌గా స్పందించడమే ఇప్పుడు అందర్నీ షాక్‌ అయ్యేలా చేస్తోంది. చిరంజీవికి తగ్గ సినిమా చేశాడు.. రామ్‌చరణ్‌ సో గ్రేట్‌ అంటూ ప్రశంసల వర్షం కురిపించాడు. ఈ ట్వీట్‌ చూస్తే నెటిజన్స్‌కి షాక్‌ కాక ఇంకేముంటుంది చెప్పండి. దెబ్బకి దిమ్మ తిరిగిపోయిందంతే. అసలింతకీ ఇది వర్మగారి ట్వీటేనా.? అని పది సార్లు రీ చెక్‌ చేసుకున్నారట మన ప్రియమైన నెటిజన్లు.

 

ఈ రకంగా మరోసారి వర్మగారు తన ట్వీట్‌తో సంచలనమయ్యారు. సంచలనం అనేది ఆయన బ్లడ్‌లోనే ఉంది. అది లేకుంటే, ఆయన లేరు. నెగిటివ్‌ అయినా, పాజిటివ్‌ అయినా సెన్సేషన్‌ కావల్సిందే దటీజ్‌ రామ్‌గోపాల్‌ వర్మ. అంతే. ఇక 'సైరా' విషయానికి వస్తే, 2 గంటల 50 నిముషాల 50 సెకన్ల నిడివితో సింగిల్‌ కట్‌ కూడా లేకుండా సెన్సార్‌ బోర్డ్‌ 'యు / ఎ సర్టిఫికెట్‌ జారీ చేసింది. ఇక్కడితో సెన్సార్‌తో సహా అన్ని పనులనూ పూర్తి చేసుకుని 'సైరా' ధియేటర్స్‌లో సందడి చేసేందుకు ముస్తాబయ్యింది. అక్టోబర్‌ 2న 'సైరా' ప్రేక్షకుల ముందుకు రానుంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS