యంగ్ హీరో నాగశౌర్య ఇటీవల 'ఓ బేబీ' సినిమాలో కనిపించాడు. ఆ తర్వాత మరో సినిమాలో కనిపించలేదు. కానీ, మనోడి చేతిలో చాలా సినిమాలే ఉన్నాయి. దాదాపు నాలుగైదు సినిమాలున్నాయి. తాజాగా నాగశౌర్య ఖాతాలో చేరిన సినిమాకి 'మూగమనసులు' అనే టైటిల్‌ని పరిశీలిస్తున్నట్లు ఇటీవల వార్తలు హల్చల్ చేశాయి. ఆ సంగతి పక్కన పెడితే, ఈ సినిమా కోసం బాలీవుడ్ భామ టాలీవుడ్‌కి పరిచయం కానుందట.
హృతిక్ నటించిన 'సూపర్ 30'లో నటించిన ఈ ముద్దుగుమ్మని నాగశౌర్య సినిమా కోసం తీసుకురానున్నారనీ ఫిలిం నగర్ టాక్. ఫీచర్స్ పరంగా, ఫిజిక్ పరంగా పాప టాప్ లేపేలా ఉంది. ఇప్పటికే అలియాభట్ వంటి హీరోయిన్లు స్టార్డమ్తో సంబంధం లేకుండా టాలీవుడ్లో సందడి చేస్తున్నారు. కొత్తగా టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు ఇంకా చాలా మంది నార్త్ భామలు ఆసక్తి చూపుతున్నారు.
ఆ క్రమంలోనే మృణాల్ ఠాకూర్‌గా పిలవబడే ఓ బాలీవుడ్ బ్యూటీ తెలుగులోకి అడుగుపెట్టబోతోందట. అయితే, ఈ వార్తలో నిజమెంతో తెలీదు. ఇంకా అఫీషియల్ క్లారిటీ రాలేదు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ సినిమాకి లక్ష్మీ సౌజన్య దర్శకత్వం వహిస్తున్నారు. అక్టోబర్ నుండి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జరగనుంది. ప్రస్తుతం 'అశ్వధ్ధామ' సినిమాతో బిజీగా ఉన్నాడు నాగశౌర్య. మెహ్రీన్ కౌర్ ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది.