ఒకప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పైన దర్శకుడు ఆర్జీవీ తరచు ఏదో ఒక వ్యాఖ్య చేస్తుండేవాడు. అయితే ఒకరోజు పవన్ ఆర్జీవీ కౌంటర్ ఇవ్వడంతో ఇక పై తాను పవన్ కళ్యాణ్ పైన ఎటువంటి కామెంట్స్ చేయనని ఆర్జీవీ తేల్చిచెప్పాడు.
అయితే ఇచ్చిన మాట పైన నిలబడను అనే మాటని పదే పదే చెబుతుండే రాము ఇప్పుడు పవన్ రాసిన ‘ఇజం’ పుస్తకం పైన కామెంట్ చేసి తన మాట నిలబెట్టుకోలేని మాటని నిలుపుకున్నాడు. ఇక పవన్ కళ్యాణ్ ‘ఇజం’ పుస్తకం పైన తాను రాసిన బహిరంగ లేఖని తన సోషల్ మీడియా ఎకౌంటు ద్వారా పోస్ట్ చేశాడు.
అందులో ఏం చెప్పాడంటే- ఇజం పుస్తకంలోని అంశాల కన్నా పవన్ వద్ద ఇంకా ఎక్కువ విషయం ఉందని అలాగే ఆయన రాజకీయ పార్టీ పెట్టడానికి సరైన వ్యక్తి అని పొగిడాడు. అయితే ఆ పుస్తకంలోని అంశాలు చదివాక అందులో కొన్ని పవన్ ని తప్పుదోవ పట్టించేలా ఉన్నట్టు అనిపించిందట.
ఇదే క్రమంలో బ్రూస్ లీ ని పవన్ ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉందని చెబుతూ బ్రూస్ లీ జీవితంలో పాటించిన సూత్రాన్ని పవన్ గనుక పాటిస్తే ఈ సమాజానికి అవసరమైన చైతన్యాన్ని పవన్ ఇవ్వగలుగుతాడు అని తన మనసులోని మాట చెప్పాడు.
ఆఖరికి.. పవన్ ‘ఇజం’ పుస్తకం తనని నిరాశపరిచినా, పవనిజం పైన తనకి పూర్తివిశ్వాసం ఉన్నట్టు తెలియచేశాడు.