ఆర్జీవీ GSTకి బ్రేక్ పడింది

మరిన్ని వార్తలు

ప్రముఖ దర్శకుడు ఆర్జీవీ తాజాగా తీసిన GST అనే వీడియో గత కొన్నిరోజులుగా సంచలనం సృష్టిస్తున్నది.

ముందుగా చెప్పినట్టు ఈ చిత్రం ఈ రోజు ఉదయం 9గంటలకు విడుదలైంది. అయితే విడుదలైన కొద్దిసేపటిలోనే ఆ వీడియో ఉన్న సైట్ డౌన్ అవ్వడం జరిగింది. ఇలా జరగడానికి కారణం- ఒక్కసారిగే కొన్ని లక్షల మంది ఆ సైట్ ని ఓపెన్ చేసే ప్రయత్నం చేయడమే ఇందుకు కారణం అని చెబుతున్నారు.

ఇదే అంశం పైన దర్శకుడు ఆర్జీవీ కూడా తన ట్విట్టర్ ద్వారా ట్వీట్ చేశారు- 'స్ట్రయిక్ ఫోర్స్' అనే సంస్థ ఈ వీడియో ని విడుదల చేయగా, విపరీతమైన ఆన్ లైన్ ట్రాఫిక్ కారణంగా కొద్దిసేపటికే ఆ సైట్ డౌన్ అయింది అని, సైట్ అప్ గ్రేడింగ్ పనులు జరుగుతున్నాయి అని తెలిపాడు. అప్ గ్రేడ్ పూర్తయ్యాక తాను ఆ విషయం వెళ్ళడిస్తాను అని చెప్పాడు.

మొత్తానికి.. ఈ వీడియో ని వ్యతిరేకించే వారు ఎంత మంది బయటకి కనిపిస్తున్నా దీనిని చూడాలనుకునే వారి సంఖ్య అంతకి వందరెట్లు ఉంది అని అర్ధమైపోతుంది.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS