నందమూరి బాలకృష్ణ ఇంట్లో కాల్పున ఘటన.. చిత్రసీమ అంత తేలిగ్గా మర్చిపోదు. బెల్లంకొండ సురేష్ ఆసుపత్రిలో చేరడం, ఆ తరవాతి పరిణామాలూ - టాలీవుడ్ ని షాక్‌కి గురి చేశాయి. ఇప్పటికీ ఆ విషయాల గురించి చిలవలు పలవలుగా మాట్లాడుకుంటూనే ఉంటారు సినీ జనాలు. ఇప్పుడు అదే విషయాన్ని మరోసారి `తెర`పైకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడు రాంగోపాల్ వర్మ.
ఈమధ్య వర్మ.. ఏటీటీ కోసం వరుసగా సినిమాలు తీస్తున్న సంగతి తెలిసిందే. పవన్ కల్యాణ్ కథని `పవర్ స్టార్` పేరుతో తీస్తున్నట్టే.. ఇప్పుడు బాలయ్య కథనీ చెప్పబోతున్నాడట. ఈసారి బాలకృష్ణ ఇంట్లో జరిగిన కాల్పుల వ్యవహారంపై సినిమా తీయబోతున్నాడట. ఈ సినిమాకి `ఆ రాత్రి ఏం జరిగిందంటే` అనే టైటిల్ పెట్టినట్టు తెలుస్తోంది. బాలకృష్ణ ఇంట్లో ఓ రోజు రాత్రి జరిగే కథ ఇది. ఇందులో వర్మ నిజాలే చూపించడానికి ప్రయత్నిస్తున్నాడట. ఆ కేసుని మరోసారి క్షుణ్ణంగా పరిశీలించి.. స్క్రిప్టుని తయారు చేశాడట వర్మ. చూస్తుంటే... ఈసారి బాలయ్య ఫ్యాన్స్‌కి నిద్రలేకుండా చేయాలని వర్మ కంకణం కట్టుకున్నట్టు కనిపిపిస్తోంది. పవన్ కల్యాణ్ సినిమా తీసినట్టే, ఈ సినిమా కూడా బాలయ్య డూప్ తో లాగించడానికి ట్రై చేస్తున్నాడట. మరి అదెంత వరకూ వర్కవుట్ అవుతుందో చూడాలి.