డి.రామానాయుడు... నిర్మాతలలో ఘనుడు. కరెన్సీ నోటుపై ఉన్న అన్ని భాషల్లోనూ సినిమాలు తీసిన అరుదైన ఘనత ఆయనది. అందుకే మూవీ మొఘల్ గా కీర్తి గడించారు. సురేష్ ప్రొడక్షన్స్ స్థాపించి, చిత్రసీమలోని అందరు హీరోలతోనూ సినిమాలు తీశారు. ఆయన బానర్ ఓ బ్రాండ్‌గా మారిపోయింది. అయితే రామానాయుడుకి ఓ కోరిక ఉండేది. చిరంజీవితో మంచి కమర్షియల్ హిట్ తీయాలని. చిరుతో సురేష్ ప్రొడక్షన్స్ లో వచ్చిన ఒకే ఒక్క సినిమా.. సంఘర్షణ. మంచి సినిమానే అయినా, కమర్షియల్ గా పెద్దగా స్కోర్ చేయలేదు. అందుకే చిరుకి ఓ కమర్షియల్ హిట్ అందించాలని రామానాయుడు తాపత్రయపడేవారు.
చిరుతో సినిమా చేయాలని చాలా కథలు రెడీ చేశారు. కానీ.. ఎందుకో వర్కవుట్ కాలేదు. ఆ కోరికకు నెరవేర్చే బాధ్యత సురేష్ బాబు తీసుకున్నట్టు టాక్. కమ్ బ్యాక్ తరవాత చిరు వరుసగా సినిమాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఆచార్య సెట్స్‌పై ఉంది. ఆ తరవాత లూసీఫర్ రీమేక్ పట్టాలెక్కుతుంది. దర్శకుడు బాబీతో పనిచేయడానికి చిరు ఓకే అన్నారు. ఈ సినిమా సురేష్ ప్రొడక్షన్స్ లో తెరకెక్కే అవకాశాలున్నాయని టాక్. సురేష్‌ప్రొడక్షన్స్ లో బాబీ దర్శకత్వంలో `వెంకీ మామ` రూపుదిద్దుకుంది. ఆ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. ఆ సమయంలోనే మరో సినిమా కోసం బాబీతో ఎగ్రిమెంట్ కుదిరింది. దాంతో చిరు - బాబీ సినిమా,.. సురేష్ ప్రొడక్షన్స్ చేతుల్లోకి వెళ్లిందని టాక్.