బయోపిక్‌ల స్పెషలిస్టుగా పేరు తెచ్చుకున్నాడు రాంగోపాల్ వర్మ. ఎప్పుడూ కరెంట్ ఎఫైర్స్‌తో ట్రావెల్ చేసే వర్మ దృష్టి ఇప్పుడు నెపోటిజం పై పడింది. టాలీవుడ్ లో బంధుప్రీతి వల్ల చాలామంది బలైపోయారు. వాళ్లలో ఉదయ్ కిరణ్ కూడా ఉన్నాడు. ఇప్పుడు తన కథే సినిమాగా తీయబోతున్నాడు వర్మ. వర్మ సినిమా టైటిళ్లు, అందులో పాత్రల పేర్లూ.. డమ్మీలకంటే బాగుంటాయి. `పవర్ స్టార్`లో పవన్ ని ప్రవణ్‌గా మార్చాడు. నాగార్జునని సాగార్జున అన్నాడు. ఉదయ్ కిరణ్ విషయంలోనూ అంతే.
ఈ సినిమాలో ఉదయ్ పేరు.. హృదయ్ గా మార్చాడట. అంతే కాదు.. టైటిల్ కూడా `హృదయ్ కిరణ్` అని ఫిక్స్ చేశార్ట. ప్రస్తుతం ఉదయ్ కిరణ్ ని పోలిన నటుడి కోసం వర్మ అన్వేషణ మొదలెట్టాడని టాక్. ఉదయ్ కిరణ్ ఆత్మహత్య చేసుకున్న రోజు ఏం జరిగిందన్నదే అసలు కథ. మరి దాన్ని ఎలా చూపిస్తాడో? ఉదయ్ ఆత్మహత్యకు ఎవరిని బాధ్యులుగా మారుస్తాడో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాలి.