సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య ని ఇంకా ఆయన అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇది ఆత్మహత్య కాదు, హత్యే అన్నది చాలామంది నమ్మకం. ఈ విషయమై సీబీఐ దర్యాప్తు చేయించాలని సుశాంత్ సన్నిహితులు డిమాండ్ చేస్తున్నారు. దానికి తగ్గట్టే ఈ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. తాజాగా సుశాంత్ సింగ్ తండ్రి కె.కె.సింగ్ చేస్తున్న ఆరోపణలు బాలీవుడ్ ని షాక్ కి గురి చేస్తున్నాయి.
సుశాంత్ సింగ్ ఎకౌంట్ నుంచి గత ఏడాది ఏకంగా 15 కోట్లు స్నేహితురాలు రియాకి ట్రాన్స్‌ఫర్ చేసినట్టు గుర్తించారు కె.కె.సింగ్. అంత పెద్ద మొత్తాన్ని రియాకి ఎందుకు ఇచ్చారన్న సంగతి ఎవరికీ అర్థం కావడం లేదు. సుశాంత్ - రియా ఇద్దరూ చాలా సన్నిహితంగా మెలిగేవారు. సుశాంత్ ఆర్థిక వ్యవహారాలన్నీ రియానే చూసుకునేది. అలాంటిది.. ఏకంగా 15 కోట్లు రియా ఎకౌంట్లో ఎలా జమ అయ్యాయన్నది సస్పెన్స్ గా మారింది. అంతేకాదు... సుశాంత్‌కి సంబంధించిన పలు కీలకమైన డాక్యుమెంట్లు, బంగారం.. ఇవన్నీ రియా దగ్గరే ఉన్నాయట. అందుకే ఈ విషయమై ఆయన ముంబై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం ఈ కేసు దర్యాప్తు దశలో ఉంది. ఇందులో ఉన్న నిజానిజాలేమిటో కనుక్కొనే ప్రయత్నాల్లో ఉన్నారు పోలీసులు.