అదేంటో మన వర్మగారి మెదడులో సొంత ఆలోచనలకే తావుండదు. అలా అని ఆయన ఆలోచనల్ని తప్పు పట్టలేం. సొసైటీలో ముఖ్యంగా రాజకీయాల్లో ఏవైతే హాట్ టాపిక్స్ ఉంటాయో, ఆ టాపిక్స్‌నే తన సినిమాకి మెయిన్ కాన్సెప్ట్స్‌గా ఎంచుకుంటారు. రియాల్టీలో లైవ్ యాక్షన్ జరుగుతుండగానే, తన ఆలోచనలకు పదును పెట్టి, అదిరిపోయేలా టైటిల్ పెట్టి, సినిమాలు అనౌన్స్ చేసేస్తూ ఉంటారు. అయితే, వాటిలో తెర రూపం దాల్చేవి ఎన్ననేది చెప్పలేం కానీ, టైటిల్ అనౌన్స్‌మెంట్‌తోనే రావల్సిన పబ్లిసిటీ రాబట్టేసుకుంటారు. 'కమ్మ రాజ్యంలో కడపరెడ్లు' అనే సినిమాతో ప్రస్తుతం సెన్సేషనల్ మోడ్‌లో ఉన్న వర్మగారి మెదడులో మరో కొత్త ఆలోచన వచ్చేసింది.
టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ప్రస్తుతం చంద్రబాబుపై ఫైర్ అవుతున్న సంగతి తెలిసిందే. చంద్రబాబునూ, ఆయన తనయుడు లోకేష్ బాబునూ ఉతికి ఆరేసేస్తున్నారాయన. ఇదే టాపిక్‌ని మీడియా కూడా బాగానే క్యాష్ చేసుకుంటోంది. ఇక మన వర్మగారు ఊరికే ఎందుకుంటారు చెప్పండి. చంద్రబాబు మీద వంశీ చేసిన ఆరోపణలతో వర్మగారి మెదడులో ఈ మెరుపులాంటి ఆలోచన మెదిలింది. అదే 'రెడ్డి రాజ్యానికి కమ్మ ఫ్యాన్స్'. టైటిల్ అదిరిపోలా.
'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' సినిమాకి సీక్వెల్‌గా ఈ సినిమా తీయాలని వర్మగారు భావిస్తున్నారట. త్వరలోనే 'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' సినిమాని ప్రేక్షకుల్లోకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇటీవల విడుదలైన ట్రైలర్‌తో వర్మగారు అందుకున్న పబ్లిసిటీ అంతా ఇంతా కాదు, ఇప్పుడు కొత్తగా రంగంలోకి దిగిన 'రెడ్డి రాజ్యానికి కమ్మ ఫ్యాన్స్' ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తారో చూడాలి మరి.