'అర్జున్‌రెడ్డి' టైటిల్‌ని ఇంగ్లీష్‌లో డిజైన్ చేయించి, అందర్నీ అవాక్కయ్యేలా చేశాడు సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ. ఆ తర్వాత కూడా తన సినిమాల్లో కొన్ని టైటిల్స్ అయిన 'డియర్ కామ్రేడ్', 'వరల్డ్ ఫేమస్ లవర్' చిత్రలా టైటిల్స్‌ని తెలుగుతో పాటు, ఇంగ్లీష్‌లో కూడా డిజైన్ చేయించాడు ఆయా పోస్టర్స్‌పై. అయితే, తాజాగా రామ్, రవితేజ వంటి ఎనర్జిటిక్ మాస్ హీరోలు కేవలం తమ సినిమా టైటిల్స్‌ని ఇంగ్లీష్‌లోనే ప్రింట్ చేయించడం కొన్ని విమర్శలకు తావిస్తోంది. రామ్ నటిస్తున్న 'రెడ్' చిత్రం టైటిల్ ఇంగ్లీష్‌లోనే ఉంటుంది.
ఇది తమిళ చిత్రం 'తడమ్'కి రీమేక్‌గా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. కిషోర్ తిరుమల దర్శకత్వంలో క్రైమ్ థ్రిల్లర్‌గా రూపొందుతోన్న సబ్జెక్ట్ ఇది. ఇదిలా ఉంటే, వెరీ లేటెస్ట్‌గా మాస్ రాజా రవితేజ కూడా తన సినిమాకి ఇంగ్లీష్ టైటిల్‌నే వాడేశాడు. గోపీచంద్ మలినేని - రవితేజ కాంబో మూవీకి 'క్రేక్' అని ఇంగ్లీష్ లెటర్స్‌తో టైటిల్ పోస్టర్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. మాస్‌లో మస్త్ ఫాలోయింగ్ ఉన్న ఈ ఇద్దరూ టైటిల్స్ పట్ల ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడానికి కారణాలేమో కానీ, చూస్తుంటే, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని మన ఈ హీరోలు బాగా ఫాలో అయిపోతున్నట్లుంది.
జగన్ ప్రభుత్వం తెలుగు మీడియాన్ని పూర్తిగా నిషేధించేసి, అన్ని ప్రభుత్వ విద్యాలయాల్నీ ఇంగ్లీష్ మీడియంలోకి మార్చేయాలనే ప్రతిపాదన తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. అందుకే మన హీరోలు తమ సినిమాలకు డైరెక్ట్‌గా ఇలా ఇంగ్లీష్ టైటిల్స్ దించేశారు కాబోలు.