RGV: చిరు.. గ‌రిక‌పాటి.. మ‌ధ్య‌లో దూరిన వ‌ర్మ‌

మరిన్ని వార్తలు

చిరంజీవి.. గ‌రికిపాటి ప్ర‌హ‌స‌నం ఇంకా అలానే కొన‌సాగుతోంది. అటు చిరంజీవి, ఇటు గ‌రిక‌పాటి ఇద్ద‌రూ కామ్ గా ఉన్నా - మ‌ధ్య‌లో ఉన్న వాళ్లు మాత్రం ఏదో ర‌కంగా ఈ టాపిక్‌ని మ‌ళ్లీ బ‌య‌ట‌కు తీసుకురావ‌డానికే ప్ర‌య‌త్నిస్తున్నారు. దాంతో ఈ ర‌చ్చ మ‌ళ్లీ మొద‌టికి వ‌స్తోంది. ఇప్పుడు రాంగోపాల్ వ‌ర్మ ఈ వ్య‌వ‌హారంలో త‌ల దూర్చాడు. ఎప్ప‌టిలానే అర్థ‌రాత్రి ట్వీట్ల‌తో హోరెత్తించాడు. ఈ టాపిక్‌ని మ‌ళ్లీ బ‌య‌ట‌కు లాగి.. చిరంజ‌వి కి వ‌కాల్తా పుచ్చుకొని, గ‌రిక‌పాటిపై సెటైర్లు వేశాడు. ఓ ర‌కంగా ఘాటుగానే విమ‌ర్శిచాడు.

 

'హే గారికపీటి.. బుల్లి బుల్లి ప్రవచనాల్లో నక్కి నక్కి దాక్కో. అంతేకాని పబ్లిసిటి కోసం ఫిల్మ్ ఇండస్ట్రీ మీద మొరగొద్దు.. మెగాస్టార్ చిరంజీవి ఏనుగు.. నువ్వేంటో నీకు తెలివుందని అనుకుంటున్నావు కాబట్టి.. నువ్వే తెలుసుకో''

 

''హే గూగురుపాటి నరసింహ రావు.. తమరు గ(డ్డిప)రిక అయితే మా చిరంజీవి నరసింహ.. ఆ మిగిలిన రావుని మీ పంచ జేబులో పెట్టుకోండి``

 

ప‌నిలో ప‌నిగా నాగ‌బాబునీ ఈ మేట‌ర్ లో ఇన్వాల్వ్ చేశాడు. ''సర్ నాగబాబు గారు.. మీ అన్నయ్యని ఆ గడ్డి అన్న మాటలకి.. దాన్ని తినెయ్యకుండ వదిలెయ్యడం మీ సంస్కారం.. కాని అభిమానులమైన మేము ఆ గ(డ్డిప)రిక ని మంటలలో మండించకపోతే ఆ గడ్డి నమ్మే అమ్మవారు కూడ మమ్మల్ని క్షమించరు`` అంటూ వ‌రుస కౌంట‌ర్లు వేశాడు.

 

నిజానికి చిరంజీవి కుటుంబానికీ, వ‌ర్మ‌కీ మ‌ధ్య అంతులేని గ్యాప్ ఉంది. ఎప్పుడు ప‌డితే అప్పుడు.. ఎలా ప‌డితే అలా చిరునీ, ఆ ఇంటి హీరోల్నీ, ముఖ్యంగా ప‌వ‌న్ క‌ల్యాణ్‌నీ.. త‌న‌ ట్వీట్ల‌తో ఆడుకుంటుంటాడు. ఇప్పుడు చిరంజీవి వైపు నిల‌బ‌డి మాట్లాడ‌డం ఆశ్చ‌ర్యాన్ని క‌లిగిస్తోంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS