ఈమధ్య ఓ ఇంటర్వ్యూలో రాంగోపాల్ వర్మ పవన్ కల్యాణ్‌ని తెగ పొగిడేశాడు. అది చూసి పవన్ ఫ్యాన్స్ అవాక్కయ్యారు. ఎప్పుడూ లేనిది.. పవన్‌పై ఇంత ప్రేమా? అంటూ ఆశ్చర్యపోయారు. ఇప్పుడు అసలు విషయం బయట పెట్టాడు వర్మ. అదేంటంటే... పవన్‌పై వర్మ ఓసినిమా తీయబోతున్నాడట. పేరు కూడా ఫిక్సయ్యింది. అదే.. 'పవర్ స్టార్'.
నా తదుపరి సినిమా 'పవర్‌స్టార్' అని మరో ఇంటర్వ్యూలో ప్రకటించాడు వర్మ. అది పవన్‌పై సినిమానేనా? అని అడిగితే `అది చెప్పను. ఓ స్టార్ కి పవర్ స్టార్ అనే నిక్ నేమ్ ఉంటుంది. ఆ స్టార్‌పై సినిమా తీస్తున్నా` అంటున్నాడు. పవర్ స్టార్ అంటే ఎవరో.. తెలుగు ప్రేక్షకులకు, పవన్ అభిమానులకు వేరే చెప్పాలా? మొత్తానికి పవన్ కల్యాణ్ ని మరోసారి టార్గెట్ చేసేశాడు వర్మ. ఇందులో పవన్ మూడు పెళ్లిళ్ల వ్యవహారాలు, రాజకీయాలూ, సినిమా జీవితం.. అన్నీ మిళితం చేసే ఛాన్సుంది. అన్నట్టు.... దీన్ని కూడా ఓటీటీలోకే విడుదల చేస్తాడట.