పోయి పోయి `పవర్ స్టార్`తో పెట్టుకున్నాడు వర్మ. ఈ సినిమా తప్పకుండా టాలీవుడ్ ని షేక్ చేస్తుందని జనాల నమ్మకం. వర్మ ధీమా కూడా అదే. పవర్ స్టార్ అభిమానులు తలచుకుంటే తన సినిమాని హిట్ చేస్తారు. వాళ్లలో పది శాతం సినిమా చూసినా - తన బడ్జెట్ గిట్టుబాటు అయిపోతుంది. కుప్పలు కుప్పలుగా లాభాలు వస్తాయి. పైగా ట్రైలర్‌కి కూడా టికెట్టు పెట్టేశాడు. ట్రైలర్ చూడాలంటే పాతిక కట్టమన్నాడు. పవన్ ఫ్యాన్స్ కదా.. ట్రైలర్ ఎలా ఉంటుందో అంటూ తప్పకంఉడా చూస్తారు. ఆ లెక్కన చూసినా తన బడ్జెట్ ట్రైలర్‌తోనే వచ్చేస్తుంది. కానీ... వర్మ ప్లానింగ్ మొత్తం నాశనం అయ్యింది.
ట్రైలర్ ముందే లీక్ అయిపోయింది. దాంతో... ట్రైలర్ చూడ్డానికి అడ్వాన్సు బుకింగు చేసినవాళ్లకి ఆ సొమ్ముని వెనక్కి ఇచ్చేస్తున్నాడు వర్మ. అసలు ట్రైలర్ ఎలా లీకైందన్నదే అసలు ప్రశ్న. తన టీమ్ లోని వాళ్లే ట్రైలర్ లీక్ చేశారని వర్మ నమ్ముతున్నాడు. ఈ సినిమాని ఎలాగైనా ఆపేయాలని ఓ వర్గం ప్రయత్నిస్తోంది. వాళ్లే.. ట్రైలర్‌ని కావాలని లీక్ చేశారని తెలుస్తోంది. అంతే కాదు.. ఈ సినిమా విడుదలని కూడా అడ్డుకోవాలని భావిస్తున్నార్ట. ఒకవేళ అది వీలు కాకపోతే.. ఈ సినిమా ని కూడా లీక్ చేసే ఛాన్సుందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.