శ్రీరెడ్డితో పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేయించడంలో అసలు సూత్రధారిని నేనే అని ఒప్పుకున్న వర్మ, పవన్ కళ్యాణ్‌కీ, మెగా అభిమానులకు క్షమాపణలు చెప్పిన సంగతి తెలిసిందే. అయితే వర్మ క్షమాపణలు చెప్పడాన్ని ఎవ్వరూ నమ్మలేకపోతున్నారు ఆ సంగతి పక్కన పెడితే, 'కాస్టింగ్ కౌచ్' అంటూ నటి శ్రీరెడ్డి చేస్తున్న ఉద్యమంలోకి అనవరసరంగా రామ్‌గోపాల్ వర్మ వచ్చి దూరండం. అందులోకి సంబంధం లేని పవన్ కళ్యాణ్‌ని లాగడం, పవన్ తల్లిని శ్రీరెడ్డితో నడిరోడ్డు మీద బూతులు తిట్టించడం, ఈ వ్యవహారం వెనక ఉన్నది అంతా తానే అని వీడియో ద్వారా వర్మ చెప్పడం వివాదాలకు డైరెక్ట్ టార్గెట్ అయ్యాడు వర్మ.
మీడియా వేదికగా, సోషల్‌మీడియా వేదికగా మెగా అభిమానులు దుమ్ము దులిపేయడంతో, మెగా ఫ్యామిలీ నుండి మెగా బ్రదర్, అల్లు అరవింద్ ప్రెస్ మీట్‌లతో కాళ్ల బేరానికొచ్చాడు వర్మ. సోషల్ మీడియా వేదికగా తన తప్పు తాను తెలుసుకున్నాననీ, ఇకపై ఎప్పుడూ పవన్ కళ్యాణ్‌ని కానీ, మెగా కుటుంబాన్ని కానీ, దూషించనని ఒట్టు పెట్టాడు. అయితే వర్మ గతంలోనూ చాలా ఒట్లు పెట్టాడు. ఒట్టు పెట్టడం వెంటనే తీసి గట్టున పెట్టేయడం కూడా వర్మకి బాగా అలవాటు.
కానీ ఈ సారి అలా కాదట. మెగా ఫ్యామిలీ జోలికి పోనని వర్మ తన తల్లిపై ఒట్టు పెట్టాడు. ఇంతకు ముందెన్నడూ తన తల్లిపై ఒట్టు పెట్టలేదనీ అందుకే ఈ సారి నా ఒట్టు నిజమైందనీ వర్మ అంటున్నాడు. నమ్మాలా? వద్దా? ఏమో ఆయన విజ్ఞతకే వదిలేయాలి.