వర్మ ఏం చేసినా వెరైటీనే. వాటి ఫలితాలెలా ఉంటాయన్నది పక్కన పెడితే - కచ్చితంగా పాత్ బ్రేకింగ్ ఆలోచనతో వస్తాడు. థియేటర్లు లేక, తీసిన సినిమాల్ని ఏం చేసుకోవాలో తెలీక సతమతమవుతున్న తరుణంలో ఏటీటీ ద్వారా సినిమాల్ని విడుదల చేస్తున్నాడు. టికెట్‌కి ఓ రేటు ఫిక్స్ చేసి - లాభాల్ని ఆర్జిస్తున్నాడు. తన తాజా చిత్రం `పవర్ స్టార్` కూడా ఏటీటీలోనే విడుదల చేస్తున్నాడు. టికెట్ కి 150 ఫిక్స్ చేశాడు. అయితే.. ఈ సినిమాకి సంబంధించిన టికెట్లు బ్లాక్‌లోనూ అమ్ముతానంటున్నాడు వర్మ.
ఈనెల 24న ఉదయం 11 గంటలకు పవర్ స్టార్ సినిమా విడుదల కాబోతోంది. దానికి ముందు టికెట్ బుక్ చేసుకుంటే 150 రూపాయలే. ఆ తరవాత టికెట్ బుక్ చేసుకొంట 250 చెల్లించాలి. ఇది బ్లాక్ టికెట్ రేటు. ఆన్ లైన్లోనూ.. బ్లాక్టికెట్లు అమ్మొచ్చని వర్మ ఈ సినిమాతో నిరూపించబోతున్నాడు. అయితే ట్రైలర్ కి 25 రూపాయలు పెడితే ఆ ప్రయోగం బెడసి కొట్టింది. ట్రైలర్ ముందే లీకైపోయి వర్మ ఆశలపై నీళ్లు చల్లింది. సినిమా అయినా సవ్యంగా బయటకు వస్తుందో లేదో??