ఆర్జీవీ బిజినెస్ స్కిల్స్ అద్భుతః..!

By iQlikMovies - June 09, 2020 - 10:30 AM IST

మరిన్ని వార్తలు

ఒక సినిమా హిట్ అనేది ఎలా నిర్థారిస్తారు? లాభాలు తీసుకొస్తే హిట్టు.. లేకపోతే ఫ్లాపు అనేది అందరూ ఒప్పుకుంటారు. ఈలెక్కన రామ్ గోపాల్ వర్మ తాజా చిత్రం 'క్లైమాక్స్' సూపర్ డూపర్ బంపర్ హిట్ అని ఫిలిం నగర్లో టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాను ఆర్జీవీ 'ఎటీటీ'(ఎనీ టైం థియేటర్) కాన్సెప్ట్ లో శ్రేయాస్ ఈటీ యాప్ ద్వారా విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాను చూడాలంటే శ్రేయాస్ ఈటీ యాప్ డౌన్ లోడ్ చేసుకుని వంద రూపాయలు టికెట్ చెల్లించాలి. టాక్సులు ఎక్స్ట్రా. సినిమాకు రివ్యూలు దాదాపుగా నెగెటివ్ గా వచ్చాయి.

 

ఎడారిలో పాలకోవా లాంటి మియా మాల్కోవా నడుము కింద నుంచి వచ్చిన సూర్యకిరణాల షాట్స్ మినహాయిస్తే పెద్దగా చెప్పుకోదగ్గ విషయం లేదని ఎక్కువ మంది పెదవి విరిచారు. ఇదిలా ఉంటే ఈ రివ్యూలకు, విమర్శలకు సంబంధం లేకుండా సినిమాకు భారీ లాభాలు వచ్చాయని అంటున్నారు. ఈ సినిమాకు అయిన బడ్జెట్ 20 లక్షలే అని, 'జీ ఎస్ టీ' సినిమా టైమ్ లోనే ఈ సినిమాను పూర్తి చేశారని, రెండు సినిమాలకు కలిపి మాల్కోవాకు పారితోషికం ముట్టచెప్పారని అంటున్నారు. అయితే ఈ సినిమా రిలీజ్ చేసిన మొదటి 12 గంటల్లోనే టికెట్స్ సేల్ ద్వారా 1.68 కోట్ల ఆదాయం వచ్చింది.

 

ఈ విషయం ఆర్జీవీ స్వయంగా తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలిపారు. కలెక్షన్స్ ఇంకా వస్తూనే ఉన్నాయి. ఎటీటీ కాన్సెప్ట్ ను ఉపయోగించుకుని ఇలా సినిమా రిలీజ్ చేసి కాసుల పంట పండించుకోవచ్చని ఆర్జీవీ ప్రూవ్ చెయ్యడంతో ఒక్కసారిగా ఈ కాన్సెప్ట్ ఏంటి.. ఎలా రిలీజ్ చేసుకోవాలి అంటూ చాలామంది నిర్మాతలు ఆరాలు తీస్తున్నారట. సినిమాపై ఎవరు ఎన్ని కామెంట్లు చేసినా సరే.. ఆర్జీవీ బిజినెస్ స్కిల్స్ మాత్రం అద్బుతః అని చెప్పక తప్పదు!


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS