బాలీవుడ్ నటి రియా చక్రవర్తి ఇటీవల పలు వివాదాలతో వార్తల్లోకెక్కిన విషయం విదితమే. బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుట్ అనుమానాస్పద మరణం కేసులో రియా చక్రవర్తిపై ఆరోపణలొచ్చాయి. ఆమెపై డ్రగ్స్ ఆరోపణల్నీ చూశాం. ఈ కేసులో అరెస్టయి, ఆమె కొన్నాళ్ళు జైల్లో కూడా వుండాల్సి వచ్చింది. ఆ తర్వాత బెయిల్‌పై విడుదలయిన రియా చక్రవర్తి, కొంత కాలం పాటు, అత్యంత సన్నిహితుల నడుమనే గడుపుతునన్నారు తప్ప, బయటకు రాలేదు.
అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, ప్రముఖ బాలీవుడ్ నిర్మాత ఒకరు రియా చక్రవర్తితో ఓ సినిమా ప్లాన్ చేస్తున్నారట. ఆ సినిమా అతి త్వరలోనే సెట్స్ మీదకు వెళ్ళనున్నట్లు తెలుస్తోంది. బాలీవుడ్‌పై నేషనల్ మీడియా ప్రదర్శిస్తోన్న వైఖరిని కడిగి పారేసేలా ఆ సినిమా వుంటుందనే ప్రచారం జరుగుతోంది. ఓ సీనియర్ జర్నలిస్ట్ పాత్రని సెంట్రిక్‌గా పెట్టి రియా చక్రవర్తితో ఈ సినిమా చేయబోతున్నారని సమాచారం. ఇందుకోసం ఓ ప్రముఖ బాలీవుడ్ నటుడ్ని కూడా ఇప్పటికే అప్రోచ్ అయ్యారట.
ఇదిలా వుంటే, దీన్నొక సినిమాలా కాకుండా, వెబ్ సిరీస్‌లా చేస్తే బావుంటుందన్న ప్రతిపాదన కూడా వున్నట్లు తెలుస్తోంది. సినిమానా.? వెబ్ సిరీస్ వైపు మొగ్గు చూపుతారా.? అన్నదానిపై కొద్ది రోజుల్లోనే స్పష్టత రానుందనీ, వెబ్ సిరీస్‌కి ప్రస్తుత పరిస్థితుల్లో రీచ్ ఎక్కువ వుంటుందనే కోణంలోనూ సమాలోచనలు జరుగుతున్నాయని సమాచారం.