నాగార్జున కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం `వైల్డ్ డాగ్`. ఇదో యాక్షన్ థ్రిల్లర్. షూటింగ్ దాదాపుగా పూర్తికావొచ్చింది. అయితే... ఈసినిమాని ఓటీటీకి ఇచ్చేయాలని నిర్మాతలు భావిస్తున్నారని సమాచారం. ఇటీవల కొన్ని ఓటీటీ సంస్థలతో నిర్మాతలు సంప్రదింపులు జరిపారని, ఆ బేరాలు ఓ కొలిక్కి వచ్చాయని టాక్. నెట్ ఫ్లిక్స్ కి ఈ సినిమాకి 25 కోట్లకు ఇచ్చేశారని తెలుస్తోంది.
ఈ సినిమాకి దాదాపు 18 కోట్ల వరకూ బడ్జెట్ అయ్యిందట. అలా చూస్తే... 7 కోట్లు టేబుల్ ప్రాఫిట్ వచ్చినట్టే. ఈ సంక్రాంతికి నెట్ ఫ్లిక్స్‌లో ఈ సినిమా చూసే అవకాశం ఉందని ఫిల్మ్‌నగర్ వర్గాల టాక్. దియా మీర్జా, సయామీఖేర్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని మాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ నిర్మించింది. త్వరలోనే డిజిటల్ రిలీజ్‌కి సంబంధించిన ఓ అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలున్నాయి.