సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్య వెనుక ప్రధాన సూత్రధారి, పాత్రధారి రియా చక్రవర్తి అన్నది అందరి అనుమానం. సుశాంత్ అభిమానులైతే ముందు నుంచీ రియాని టార్గెట్ చేస్తూనే వస్తున్నారు. సుశాంత్ కుటుంబ సభ్యులు సైతం రియా వల్లే తమ కొడుకు ఆత్మహత్య చేసుకున్నాడని నినదిస్తున్నారు. సీబీఐ కన్ను కూడా రియాపైనే ఉంది. ఇప్పటికే పలుమార్లు సీబీఐ విచారణకు హాజరైంది రియా. ఇప్పుడు వీటన్నింటికీ ప్రతీకారం తీర్చుకోవడానికి రెడీ అవుతోంది రియా.
తనపై ఇన్ని ఆరోపణలు చేసినందుకు... సుశాంత్ సింగ్ కుటుంబంపై చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి రెడీ అయ్యింది. తనని సుశాంత్ సింగ్ కుటుంబం మానసికంగా హింసించిందని, క్షోభపెట్టిందని, తన పరువుకీ, ప్రతిష్టకు భంగం కలిగించారని రియా ఇప్పుడు కోర్టులో కేసు ఫైల్ చేయబోతోంది. సుశాంత్ సింగ్ ఆర్థిక వ్యవహారాలన్నీ రియానే చూసుకునేదని, సుశాంత్ మరణానికి ముందు రియా ఎకౌంట్ లోకి పెద్ద ఎత్తున నగదు బదిలీ అయ్యిందన్నది ప్రధాన ఆరోపణ.
సుశాంత్ సింగ్ కి సంబంధించిన ఆస్తులు, కొన్ని విలువైన డాక్యుమెంట్లు రియా దగ్గరే ఉన్నాయని సుశాంత్ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. వీటన్నింటికీ ప్రతిగా రియా ఇప్పుడు కోర్టులో కేసు ఫైల్ చేయబోతోందట. నిరాధారమైన ఆరోపణలతో తనని మానసికంగా హింసించారన్నది రియా ఆవేదన. మొత్తానికి రియా ఎదురుదాడికి సిద్ధమైంది. మరి కోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందో. న్యాయం ఎటు వైపు నిలుస్తుందో?