ఇసుక తిన్నెల్లో ‘తూనీగ’ పాప బికినీ హొయలు

మరిన్ని వార్తలు

‘తూనీగా తూనీగా’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల్ని తన ముద్దు ముద్దు మాటలతో ఆకట్టుకున్న ముద్దుగుమ్మ రియా చక్రవర్తి. కాస్త బక్క పలుచగా కనిపించినా, ఓవరాల్ గా ఈ పాపని బాగానే యాక్ సెప్ట్ చేశారు మన ప్రియమైన ప్రేక్షకులు. కానీ, పాపకి పాపం మరో ఛాన్స్ రాలేదనుకోండి. తర్వాత బాలీవుడ్ లో ఒకటీ అరా సినిమాలు చేసింది కానీ, అక్కడా పెద్దగా ఫేమ్ దక్కించుకోలేకపోయింది. ‘జలేబీ’ అంటూ ఓ హిందీ సినిమాలో హీరోతో డిఫరెంట్ లిప్ లాక్ చేసి, కొన్నాళ్లు న్యూస్ లో హాట్ టాపిక్ గా నిలిచింది. ఆ తర్వాత మళ్లీ రొటీన్. నో ఛాన్సెస్. కానీ, సోషల్ మీడియాలో అప్పుడప్పుడూ తన తళుకు బెళుకు అందాలతో రెచ్చిపోయి హాట్ పోజులిస్తూ కనిపిస్తుంటుంది. అలా లేటెస్ట్గ్ గా ఇచ్చిన ఓ హాట్ పోజు ఇప్పుడు వైరల్గా మారింది. బీచ్ ఒడ్డున ఇసుక తిన్నెల్లో బ్లూ ప్రింటెడ్ డిజైన్లో బికినీ ధరించి కిర్రాక్ పోజిచ్చింది. హెయిర్ ని లూజ్ గా వదిలేసి, రెండు చేతులూ తలపై పెట్టుకుని, ఇసుకలో క్రేజీగా కూర్చుంది. నిజంగానే ఈ లుక్ చూసేందుకు క్రేజీగానే ఉంది. అన్నట్లు లాక్డౌన్ వేళ బీచ్ లన్నీ బంధ్ అయిపోయాయ్ కదా.. మరి ఈ భామ సేద తీరుతున్న ఈ బీచ్ ఎక్కడిదో.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS