బికీనీ తూనీగ.. హాట్‌ హాట్‌గా!

By iQlikMovies - November 12, 2018 - 16:05 PM IST

మరిన్ని వార్తలు

బికినీ సెల్ఫీలో హీటెక్కించేస్తోన్న ఈ బ్యూటీ ఎవరో తెలుసా? గుర్తుపట్టేందుకు కాస్త ప్రయత్నించండి. తెలుగులో ఒకే ఒక్క సినిమా చేసిన ఈ బ్యూటీ పేరు రియా చక్రవర్తి. ప్రముఖ నిర్మాత ఎంఎస్‌ రాజు తనయుడు సుమంత్‌ అశ్విన్‌ హీరోగా నటించిన తొలి సినిమా 'తూనీగ తూనీగ' సినిమాలో హీరోయిన్‌గా నటించింది ఈ రియా. ఈ బెంగాలీ ముద్దుగుమ్మ బాలీవుడ్‌లో అడపా దడపా కొన్ని సినిమాలు చేస్తున్నా, సరైన సక్సెస్‌ కోసం ఆమె ఎదురుచూపులు మాత్రం కొనసాగుతూనే వున్నాయి. అప్పుడప్పుడూ సోషల్‌ మీడియాలో ఇదిగో ఇలా హీటెక్కించే ఫొటోలతో హల్‌చల్‌ చేసేస్తోంది ఈ బెంగాలీ భామ. ఇటీవలే ఈ బ్యూటీ నటించిన 'జలేబీ' ప్రేక్షకుల ముందుకొచ్చింది. హాట్‌ హాట్‌గా ఈ బ్యూటీ అందులో కన్పించిందిగానీ, మరోమారు ఈ బెంగాలీ భామకి నిరాశే మిగిలింది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS