హాట్‌ తూనీగ.. నవ్వేదిలాగా.?

By iQlikMovies - November 08, 2018 - 11:08 AM IST

మరిన్ని వార్తలు

'తూనీగ తూనీగ' సినిమాతో తెలుగు ప్రేక్షకుల్ని పలకరించిన బెంగాలీ భామ రియా చక్రవర్తి, మళ్ళీ తెలుగులో కన్పించలేదు. అడపా దడపా బాలీవుడ్‌ సినిమాల్లో నటిస్తోన్న ఈ బ్యూటీ, సోషల్‌ మీడియాలో మాత్రం యాక్టివ్‌గానే వుంటూ వస్తోంది. యాక్టివ్‌గా అంటే, హాట్‌ హాట్‌ ఫొటోల్ని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడం ద్వారా అన్నమాట. అలా అభిమానుల్ని పెంచుకుంటున్న ఈ భామ, లేటెస్ట్‌గా సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసిన ఈ ఫొటో వైరల్‌గా మారింది. 'అదిరిపోయింది' అని కాదు, ఇదేం పోజు? అని అందరూ విమర్శించేలా. ఏదో ఎక్స్‌పోజింగ్‌ చేయాలి కాబట్టి.. అన్నట్టుందే తప్ప, ఈ ఫొటోకి అసలు అర్థమే లేదన్నది చాలామంది అభిప్రాయం. అయితే, రియా దీనికి ఏదో కథ చెబుతుందనుకోండి, అది వేరే సంగతి. ఎందుకంటే ఈ బ్యూటీ భలే తెలివైంది. గడసరి కూడా. ఆమె చెప్పే కథ ఎలా వున్నా, చూసుకున్నోళ్ళకి చూసుకున్నంత.. పండగ చేస్కోండంటున్న ఈ బ్యూటీ సొగసులు పండగ చేసుకునేలా వున్నాయంటారా?
 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS