తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో శృంగార తారగా పాపులరైన నటి షకీలా. ఇప్పుడు ఈమె బయోపిక్‌ని తెరపై ఆవిష్కరిస్తున్నారు. మొన్న సిల్క్‌స్మిత 'డర్టీ పిక్చర్'. నిన్న సన్నీలియోన్ 'కరణ్‌జీత్‌కౌర్'. నేడు 'షకీలా'. ఇలా శృంగార తారల బయోపిక్స్‌పై పడిందిప్పుడు చిత్ర పరిశ్రమ. అయితే తాజా బయోపిక్ 'షకీలా' విషయానికి వస్తే, ఈ పేరు చాలా పరిచయమున్న పేరు. ఈ బయోపిక్ అంటే ఆడియన్స్‌లో అప్పుడే ఆశక్తి మొదలైపోయింది. బాలీవుడ్ నటి రిచా చడ్డా ప్రధాన పాత్రలో ఈ సినిమా రూపొందుతోంది.
తాజాగా ఈ సినిమా విషయమై రిచా చడ్డా షకీలాని కలిసిందట. ఆమె నిజజీవితం గురించి పూర్తిగా తెలుసుకుందట. ఇద్దరూ కూర్చొని చాలా సేపు మాట్లాడుకున్నారట. ఆమె జీవిత చరిత్ర గురించి విని చాలా షాక్ తిన్నదట రిచా. తన జీవితంలో జరిగిన సంఘటనలన్నింటినీ ఈ చిత్రంలో చూపించబోతున్నారట. తెరపై శృంగార తారలుగా మాత్రమే కనిపించే ముద్దుగుమ్మల రియల్ లైఫ్‌లో ఎన్నో తెలియని కష్ట నష్టాలు, ఇంట్రెస్టింగ్ కథలు నెలకొని ఉంటాయి.
తెరపై వారి ప్రపంచం వేరు. అది అందరికీ తెలుస్తుంది. తెర వెనుక వారి ప్రపంచం వేరు. అది చాలా మందికి తెలియదు. అందుకే ఆ రియల్ లైఫ్ ఇంట్రెస్టింగ్ స్టోరీస్‌ని వెలుగులోకి తీసుకొచ్చే ప్రయత్నమే ఈ బయోపిక్స్.ఈ మధ్య బయోపిక్స్‌కి మంచి ఆదరణ దక్కుతోంది. ఈ కోవలోనే షకీలా బయోపిక్ ఏ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంటుందో చూడాలి మరి.
మరోవైపు బయోపిక్స్ అంటేనే వివాదాలకు కేంద్రబిందువులు. అలాంటిది శృంగార తారల బయోపిక్స్‌లో ఆ వివాదాల జోరు మరి కాస్త ఎక్కువే. చూడాలి మరి షకీలా బయోపిక్ ఎలాంటి వివాదాల్ని ఎదుర్కొంటుందో. తెలుగు, తమిళ, మలయాళం, హిందీ భాషల్లో ఈ చిత్రం రూపొందుతోంది.