నిన్న మొన్నటి దాకా ఏ సినిమా చూసినా ముద్దులే ముద్దులు. మూతి ముద్దులు.. ఇప్పుడేమో ఆ ముద్దు చాటు కథల్ని, కథలు కథలుగా చెప్పుకొస్తున్నారు ముద్దుగుమ్మలు. ముద్దుగుమ్మలే కాదు, మన ప్రియమైన హీరోలు కూడా చెప్పేస్తున్నారు. ఇంతకీ ముద్దు కథలేంటా.? అంటారా.? తెరపై ముద్దు సీన్లను చూసి, భావోద్వేగానికి లోనయ్యే ప్రేక్షకులు ఓ ఎత్తు అయితే, ఆ సీన్లలో నటించేందుకు హీరో, హీరోయిన్లు పడే పాట్లు ఎలా ఉంటాయన్నది ఒక్కొక్కరుగా బయటికొచ్చి చెబుతుంటే, ఇదేదో ముద్దుపై ముద్దుగా నడుస్తున్న ఉద్యమంలా లేదూ. ఆ మాటకొస్తే, కాస్త ఓవర్ యాక్షన్‌లా కూడా అనిపిస్తోంది. యాక్టింగ్‌లో ముద్దు అనేది ఓ భాగం. అయితే, ఈ మధ్య శృతిమించుతోందనుకోండి. లిప్‌లాక్‌లో ఉండే అందాన్ని స్మూచ్ తో మలినం చేసేసి అసహ్యం పుట్టించేస్తున్నారు. అంతా బాగానే ఉంది కానీ, ముద్దు కాస్తా, గుద్దులా మారిపోయిందిప్పుడు ఒక్కొక్కరుగా బయటికొచ్చి ముద్దు కష్టాలు చెబుతుండడంతో.
ఇంతకీ తాజాగా ముద్దు గోల వినిపించిందెవరనే కదా.. మీ డౌట్. అయితే వినండి. బాలీవుడ్ బ్యూటీ రిచా చద్దా. లేటెస్ట్‌గా రిలీజైన ‘పంగా’ సినిమాలో ఇంపార్టెంట్ రోల్‌లో కనిపించింది ఈ ముద్దుగుమ్మ. ఈ సినిమాలో రిచాకి హీరోతో ఓ ముద్దు సీన్ ఉందట. ఆ సీన్‌లో నటించినప్పటి ఎక్స్‌పీరియన్స్‌నే ఇప్పుడిలా పంచుకుంటోంది. ముద్దు సీన్‌లో నటించడం ఏమంత చిన్న విషయం కాదు. చాలా కష్టపడాలి. చాలా భయపడాలి.. అంటూ తన అనుభవాన్ని చెప్పుకొచ్చింది. గతంలో తెలుగు భామలు పూజా హెగ్దే, రాశీఖన్నా, రష్మికా మండన్నా తదితర హీరోయిన్స్‌తో పాటు, విజయ్ దేవరకొండ, వరుణ్ తేజ్ వంటి హీరోలు కూడా ఈ ముద్దు ముచ్చట్లు అదే ముద్దు కష్టాలు పంచుకున్న సంగతి తెలిసిందే.