తనను హీరోయిన్‌గా పరిచయం చేసిన దర్శకుడు తేజతో లాంగ్ గ్యాప్ తర్వాత కాజల్ అగర్వాల్ నటించిన చిత్రం ‘సీత’. బ్యాక్ టు బ్యాక్ ఈ సీజన్‌లో రెండు సినిమాల్లో నటించింది తేజ దర్శకత్వంలో కాజల్ అగర్వాల్. అయితే, రానాతో నటించిన ‘నేనే రాజు నేనే మంత్రి’ సినిమా సూపర్ హిట్ అయ్యింది. కానీ, బెల్లంకొండతో తేజ తెరకెక్కించిన కాజల్ చిత్రం మాత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ఈ సినిమా కోసం కాజల్‌తో ప్రయోగం చేయించాడు దర్శకుడు తేజ. నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కాజల్‌ని చూపించాడు. కానీ, కాజల్‌కి అది వర్కవుట్ కాలేదు. ప్రస్తుతం కాజల్ అగర్వాల్ ‘ఇండియన్ 2’లో నటిస్తున్న సంగతి తెలిసిందే.
ఇందులోనూ ప్రయోగాత్మక పాత్రలోనే కాజల్ నటించనుందన్న ప్రచారం ఉంది. 85 ఏళ్ల బామ్మగా కాజల్‌ని చూపించబోతున్నాడట డైరెక్టర్ శంకర్. ఇదిలా ఉంటే, కాజల్ తెలుగులో మంచు విష్ణు స్వీయ నిర్మాణంలో రూపొందుతోన్న ‘మోసగాళ్లు’ అనే చిత్రంలో నటిస్తోంది. ఈ సినిమాలోనూ కాజల్ పాత్ర విభిన్నంగా ఉండబోతోందట. అది కూడా నెగిటివ్ టచ్ ఉన్న పాత్రనీ తెలుస్తోంది. అంతేకాదు, వెరీ వెరీ పవర్‌ఫుల్ రోల్ అనీ అంటున్నారు. ఎక్కువ భాగం అమెరికాలోనే షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రానికి జెఫ్రీ గీ చిన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇదో కాన్సెప్ట్ బేస్‌డ్ మూవీ అని తెలుస్తోంది. ఐటీ రంగంలో జరిగే అతి పెద్ద కుంభకోణాన్ని చేధించే నేపథ్యంలో ఈ సినిమా రూపొందుతోందట. సమ్మర్ రిలీజ్‌కి ఈ సినిమాని ప్లాన్ చేస్తున్నారు.