తాజా సంచలనం: షకీలా పాత్రలో రిచా

మరిన్ని వార్తలు

ఈమధ్య కాలంలో బయోపిక్ లకి మంచి డిమాండ్ ఏర్పడింది. దేశంలోని ప్రతి చిత్రసీమలో ప్రముఖుల బయోపిక్ ల నిర్మాణం సాగుతున్నది. ఇక తాజాగా ఈ జాబీతాలోకి శృంగార తార షకీలా పేరు చేరింది.

ఆ వివరాల్లోకి వెళితే, షకీలా జీవితాన్ని ఆధారం చేసుకుని ఒక చిత్రం రూపొందనుంది. ఇక షకీలా పాత్రలో హిందీ నటి రిచా చడ్డా నటించనుంది, దీనికి సంబంధించి అమె నుండి అధికారిక ప్రకటన కూడా వెలువడింది. ఇప్పటికే స్క్రిప్ట్ పనులు పూర్తికావడంతో ఏప్రిల్ కాని మే నెలలో షూటింగ్ మొదలుకానుంది.

కొన్నేళ్ళ క్రితం సిల్క్ స్మిత పైన చిత్రం రావడం అందులో నటించిన విద్యా బాలన్ కి అవార్డులు వచ్చాయి, ఆ సినిమా కూడా కమర్షియల్ గా సక్సెస్ అయింది. ఇప్పుడు అదే ధీమాతో షకీలా జీవితం పైన సినిమా తీసేందుకు సిద్ధమయ్యారు.

ఈ చిత్రాన్ని హిందీ, తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ బాషలలో తెరకెక్కించనున్నారు. కారణం షకీలాకి యావత్ దేశ వ్యాప్తంగా ఫ్యాన్స్ ఉండడమే. ఇక ఇంద్రజిత్ లంకేష్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS