'మిర్చి' బ్యూటీ ఘాటు మామూలుగా లేదూ!

మరిన్ని వార్తలు

'లీడర్‌' సినిమాతో క్యూట్‌ అండ్‌ డిగ్నిటీగా ఎంట్రీ ఇచ్చింది బ్యూటీ రీచా గంగోపాధ్యాయ. తర్వాత రవితేజతో 'మిరప్‌కాయ్‌' నాగార్జునతో 'భాయ్' తదితర చిత్రాల్లో నటించింది. ప్రబాస్‌తో 'మిర్చి' సినిమాలో నటించాక అమ్మడు మళ్లీ సినిమాల్లో నటించింది లేదు. అయితే ఆ తర్వాత ఈ ముద్దుగుమ్మకి పెళ్లయిపోయిందంటూ, అందుకే సినిమాల్లో నటించడం లేదనీ గాసిప్స్‌ వచ్చాయి. 

అయితే గతంలో కూడా ఈ ముద్దుగుమ్మ సినిమాల్లో ఎందుకు నటించడం లేదంటే తాను ఉన్నత చదువులు నిమిత్తం విదేశాల్లో ఉన్నాననీ, ఇప్పట్లో సినిమాల్లో నటించే ఉద్దేశ్యం లేదనీ సోషల్‌ మీడియాలో తన ఫ్యాన్స్‌కి విన్నవించింది. అయినా కానీ ఈ ముద్దుగుమ్మపై గాసిప్స్‌ ఆగడం లేదు. తాజాగా పెళ్లి గాసిప్స్‌తో ఈ ముద్దుగుమ్మ మళ్లీ సోషల్‌ మీడియాలో స్పందించాల్సి వచ్చింది. ఈ సారి మాత్రం చాలా స్ట్రెయిట్‌గా క్లారిటీ ఇచ్చేసింది ఈ హాట్‌ బ్యూటీ. పెళ్లి చేసుకుంటే, అందరికీ చెప్పే చేసుకుంటాననీ, సీక్రెట్‌గా అస్సలు చేసుకోననీ చెప్పింది. అయినా పెళ్లి చేసుకోవడం ఏమీ తప్పుడు పని కాదు కదా. దర్జాగా అందరికీ చెప్పే చేసుకుంటాననీ ఈ ముద్దుగుమ్మ ఘాటుగా స్పందించింది. 

అంతేకాదు, తాను ప్రస్తుతం స్టడీస్‌ పైనే ఫోకస్‌ పెట్టాననీ, ఇంకా ఇప్పుడప్పుడే పెళ్లి చేసుకునే ఉద్దేశ్యం లేదనీ చెప్పింది. తాను లైఫ్‌లో సాధించాల్సిన లక్ష్యాలు చాలా ఉన్నాయనీ, ఎప్పుడు ఏ విషయంలో ఎలా స్పందించాలనే దానిపై తనకు పక్కాగా క్లారిటీ ఉందనీ ఈ ముద్దుగుమ్మ అంటోంది. సినిమాల్లో నటించడం మానేసినా కానీ, తనపై అభిమానం పెంచుకున్న కొంత మంది అభిమానుల కోసమే ఇలా ఈ స్పష్టత ఇస్తున్నాననీ, దయచేసి తన అభిమానులెవరూ ఇలాంటి గాసిప్స్‌ని నమ్మవద్దనీ ఈ ముద్దుగుమ్మ క్యూట్‌గా సెలవిచ్చేసింది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS