లేటెస్ట్ సెన్సేషన్ అయిన ప్రియా ప్రకాష్ వారియర్ పైన సామాన్య జనంతో పాటుగా సెలబ్రిటీలు సైతం కామెంట్స్ కురిపిస్తున్నారు.
అందులో భాగంగానే సీనియర్ స్టార్ హీరో అయిన రిషి కపూర్ కూడా ప్రియా ప్రకాష్ పైన కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆ వ్యాఖ్యలు ఏంటంటే-
ఆ వ్యాఖ్యల్లో చివర తాను హీరోగా నటించే సమయంలో నువ్వు ఉండి ఉంటే బాగుండు అని కొంటెగా అనడంతో ఇప్పుడు ఈ కామెంట్ హాట్ టాపిక్ గా మారింది. ఈ అమ్మడు కన్నుగీటడం ఏమో కాని సామాన్యుల నుండి సెలబ్రిటీల దాకా అందరూ ఈమెకి ఫ్యాన్స్ అయిపోతున్నారు.
ఇక ఈ క్రేజ్ చూసాక ఆమె నటిస్తున్న చిత్రం చూడడానికి ప్రేక్షకులు క్యూలు కడతారు అనడంలో ఎటువంటి సందేహంలేదు.